Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషేధం ఈనాటికి కాదు... 200 యేళ్ళ నాటిది..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:19 IST)
శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై సాగుతున్న నిషేధం ఇప్పటిది కాదనీ 200 యేళ్ళనాటిదని బ్రిటిష్‌ కాలం నాటి సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న విషయం తెల్సిందే. ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా వివాదం చెలరేగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం 200 ఏళ్ల క్రితం కూడా అమలులో ఉన్నట్లు బ్రిటిష్‌ కాలం నాటి సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. బెంజమిన్‌ స్వైన్‌, పీటర్‌ ఇరే కానర్‌ అనే ఇద్దరు బ్రిటిష్‌ సైనికాధికారులు ఈ అంశంపై విస్తృత అధ్యయనం నిర్వహించారు. ఐదేళ్ల పాటు కూలంకషంగా అధ్యయనం నిర్వహించిన వీరు 1820లో ఆ వివరాలను సంకలనం చేశారు. 
 
వృద్ధులైన మహిళలు, చిన్నవయసు బాలికలు ఆలయానికి వెళ్లవచ్చని, రుతుక్రమం కొనసాగుతున్న వయసు మహిళలకు ప్రవేశం నిషిద్ధమని ఆ సైనికాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎం.జి.శశిభూషణ్‌ అనే చరిత్ర కారుడు రెండు సంకలనాలుగా ప్రచురితమైన ఈ నివేదికను ఖచ్చితమైన చారిత్రక పత్రంగా పేర్కొన్నారు. 
 
1991లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సదరు నిషేధానికి చట్టబద్ధత లభించినట్లు తెలిపారు. 1994లో ఈ నివేదికలను కేరళ గెజిట్‌ విభాగం తిరిగి ప్రచురించింది. సైనికాధికారులు తమ పరిశోధన నివేదికలో శబరిమల ఆలయాన్ని చౌరీముల్లా షస్ట(అయ్యప్ప)గా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

తర్వాతి కథనం
Show comments