పని చెప్పడం తేలికే.. కష్టాన్ని తెలుసుకోవడమే...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2015 (17:25 IST)
కిందివారికి పని చెప్పడం తేలికే! కాని చేయడంలోని కష్టాన్నితెలుసుకోవాలి. మీరు రేపు చాలా పెద్ద పెద్ద అధికారులవుతారు. కొన్నివేల కోట్లు రూపాయల నిధులు చేసే అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ నిధులు సక్రమంగా ఖర్చు కావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. ఎదుటివారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకరికొకరు అర్థమవుతుంది.
 
మా ఆఫీసు విషయమే మీకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఇన్స్‌పెక్షన్‌కు ముందు ఆఫీసంతా సర్దమన్నారు. పాత ఫైళ్లన్నిచూసి పనికిరానివి తీసివేసి పనికి వచ్చేవి ఒక క్రమంలో అమర్చుకోవాలి. మీకు తెలుసు. ఇటువంటి విషయాల్నిఎంత పట్టించుకుంటామో. మా అధికారి చిన్నసమావేశం ఏర్పాటు  చేసి అందర్నిపిలిచారు. ఐదు నిమిషాల్లో సమావేశం ముగిసింది. ఆయనేం చెప్పారో తెలుసా. నేను రేపు ఆదివారం వచ్చిపని మొదలుపెడుతున్నాను. మీలో ఎవరైనా రావచ్చు. రాకపోయిన నేనేమి అనుకోను. రేపు పని పూర్తి కాకపోతే రోజు ఉదయం 7 గంటలకే వచ్చి చేస్తాను. ఎన్నాళ్లలో అవుతుందో అన్నాళ్లలో అవుతుంది. మీరు రావాలనుకుంటే రండి.
 
ఆదివారమే ఆఫీస్ తనిఖీ ముస్తాబైంది. ఆయన అందర్నీ సమావేశపరిచి ప్రశంసించారు. ఆయన అందర్నిఆజ్ఞాపించి, వాళ్లు పని పూర్తి చేయలేకపోతే కోప్పడి హంగామా చేసి ఉంటే ఏమయ్యేది? ఆయన చెడ్డ వాడయ్యేవాడు. కింది ఉద్యోగులకు ఆయనంటే ఇష్టం ఉండేదికాదు. పని అసలే జరిగేది కాదు. అందువల్ల సమయానుకూలంగా ప్రవర్తించాలి. కోపం నివారించుకోవాలి. కలిసి పనిచేయాలి. క్రోధాన్నితొలగించుకోవటం అన్నివిధాలుగా మంచిది. మనం నేర్చుకునే విద్య మన క్రోధాన్నిపోగొట్టగలగాలి. అదొక గొప్ప విలువ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

Show comments