Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

సెల్వి
మంగళవారం, 28 అక్టోబరు 2025 (17:28 IST)
Pushpayagam in Tirumala
తిరుమలలో వార్షిక పుష్పయాగం అక్టోబర్ 30న జరుగనుంది. ఇందుకు ముందుగా అక్టోబర్ 29న అంకురార్పణంతో ప్రారంభం అవుతుంది. బుధవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వసంత మండపంలో మృత్సంగ్రహణం, ఆస్థానం, ఇతర మతపరమైన కార్యక్రమాలతో అంకురార్పణం జరుగుతుంది.
 
గురువారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, తరువాత అక్టోబర్ 30న మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది. 
 
ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ దేవతలను కల్యాణోత్సవ మండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులను చేస్తారు. ఈ శుభ సందర్భంగా వివిధ రకాల సుగంధ, సాంప్రదాయ, అలంకార పుష్పాలతో పుష్ప యాగం చేస్తారు.

ఉత్సవాల కారణంగా అక్టోబర్ 29న సహస్ర దీపాలకర సేవను, అక్టోబర్ 30న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం

మొంథా తీవ్ర తుఫాను : చీరాల ఓడరేవులో రాకాసి అలలు... తీరంలో భారీగా కోత

ప్రియురాలితో హోటల్ గదిలో వున్న భర్త, పట్టుకుని చెప్పుతో కొట్టిన భార్య (video)

ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు అదనంగా వసూలు చేస్తున్నారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

తర్వాతి కథనం
Show comments