Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం... మరో రెండు రోజుల పాటు..

Webdunia
సోమవారం, 16 మే 2016 (20:29 IST)
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల పరిణయాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. స్వామి, అమ్మవార్లు వివాహాన్ని పురస్కరించుకుని ప్రతి యేటా పరిణయోత్సవం పేరిట తితిదే సంబరాలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ యేడాది కూడా ఎంతో వైభవంగా పరిణయోత్సవాన్ని నిర్వహించింది. నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ వేదికను ఆకర్షణీయంగా నిర్మించి అలంకరణలు చేపట్టింది. 
 
గజవాహనంపై శ్రీ మలయప్పస్వామి వూరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేయగా దంతపు పల్లకిపై శ్రీదేవి, భూదేవి అనుసరిస్తూ చేరుకున్నారు. అనంతరం వేదిక వద్ద స్వామి, అమ్మవార్ల మధ్య పూలబంతులాటను అర్చకులు నిర్వహించారు. బంతులాటలో తితిదే ఈఓ సాంబశివరావు దంపతులు, తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ కోదండ రామారావులు పాల్గొన్నారు. వేలాడదీచిన పల్లకీపై శ్రీదేవి,భూదేవీ సమేత శ్రీ మలయప్పస్వామి అధిరోహించగా అర్చకులు శాస్త్రోక్తంగా పరిణయోత్సవ ఘట్టాన్ని జరిపారు. 
 
పద్మావతి పరిణయోత్సవాల కోసం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో  ప్రత్యేక ఆకర్షణగా స్వర్ణిమ మండపాన్ని తితిదే ఏర్పాటు చేసింది పరిణయ మండపం మొత్తాన్ని బంగారు వర్ణం ఫైబర్‌ రేకులతో అందంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వేంచేపు చేసిన వూంజల్‌ మండపాన్ని ఆపిల్‌, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాసపండ్లతో తీర్చిదిద్దారు. అలంకరణ మొత్తానికి ఆరు టన్నుల పుష్పాలు, రెండు టన్నుల పండ్లు వినియోగించారు. మండపం అలంకరణ పనులు పుణెకు చెందిన శ్రీ వేంకటేశ్వర ఛారిటబుల్‌ ట్రస్టు చేపట్టింది. ప్రాంగణాన్ని విద్యుత్‌ దీపాలంకరణలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. మరో రెండు రోజుల పాటు పరిణయోత్సవాలు జరుగనున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమ్స్ క్యాంపస్‌లో భోజనం కల్తీ.. 50మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్

Chandrababu: మిర్చి రైతులకు అవసరమైన సాయం అందిస్తాం.. చంద్రబాబు

జగన్ చేసిన అప్పుల వల్లే ఆర్థిక ఇబ్బందులు.. పవన్ కల్యాణ్ ఫైర్

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

తర్వాతి కథనం