Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు... భద్రతను సమీక్షించిన టీటీడీ ఈవో, ఎస్పీ

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (21:22 IST)
తిరుపతి: తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భద్రతను, ఏర్పాట్లను సమీక్షించారు. తిరుచానూరులోని అన్ని ప్రాంతాలలో తిరిగి ఏర్పాట్లును పరిశీలించారు. తిరుచానూరులో ఈ నెల 19 నుంచి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకు కనీసం 30 వేల మంది భక్తులు తిరుచానూరుకు విచ్చేస్తుంటారు. 
 
ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు టీటీడీ, అటు తిరుపతి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే రానున్న రోజుల్లో మరింత ముఖ్యమైన వాహన సేవలు జరుగనున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజి గోపాల్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టిలతోపాటు జేఈవో పోలా భాస్కర్లు తిరుచానూరు మాడ వీధులను పరిశీలించారు. 
 
వాహనాలు తిరిగే చోటులో ఏర్పాట్లను పరిశీలించారు. అదే సమయంలో భద్రతను పటిష్టం చేసే అంశంపై చర్చించారు. పుష్కరణి చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి సమీక్ష జరిపారు. గట్టి భద్రతా చర్యలు చేపడుతూనే ఎక్కడా భక్తులకు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments