Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకరజ్యోతి దర్శనంతో తరించిపోయిన అయ్యప్ప భక్తులు

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (21:12 IST)
శరబరిమలలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా మకరజ్యోతి కనిపించింది. ఈ జ్యోతిని చూడగానే భక్తకోటి జనం ఆనందపారవశ్యంలో తరించిపోయారు. శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయాయి. పొన్నాంబలమేడు కొండపై మూడుసార్లు మకర జ్యోతి కనిపించింది. ఈ జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. 
 
మకరజ్యోతి మూడుసార్లు దర్శనమివ్వడంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవశ్యంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తితో నినాదాలు చేశారు. ఈ నామ స్మరణంతో శబరిమల క్షేత్రం మార్మోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్పస్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై నుంచి అయ్యప్పస్వామికి దేవతలు, ఋషులు హారతి ఇస్తారని ఈ క్షేత్ర పురాణం చెబుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

తర్వాతి కథనం
Show comments