Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి వేడుకలు : శివనామస్మరణలో భక్తులు

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (09:40 IST)
కార్తీక మాసంలో వచ్చే తొలి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఫలితంగా శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. 
 
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఇక, అయోధ్యలో కోలాటాలతో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభమ్యాయి. గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. ప్రత్యేక పూజల, అభిషేకాలతో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. 
 
పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. భారీగా తరలి వస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి తీరంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గాలక్ష్మణేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కపిల మల్లేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. 
 
ఇక, భద్రాచలంలోని గోదావరి తీరం ఈ తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నది వద్దకు చేరుకున్న భక్తులు స్నానమాచరించి అరటి దొప్పల్లో దీపాలు వదులుతున్నారు.
 
ఇక, తెలంగాణలో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలైన రామప్ప, హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం, సిద్ధేశ్వర ఆలయం, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వర రంగనాథ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. వేయిస్తంభాల ఆలయంలో కొలువైన రుద్రేశ్వరస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments