Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు..

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (16:50 IST)
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ వివరాల మేరకు.. ఫిబ్ర‌వ‌రి 7న స్మార్థ ఏకాద‌శి, ఫిబ్ర‌వ‌రి 8న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి, ఫిబ్ర‌వ‌రి 11న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌న మ‌హోత్స‌వం, ఫిబ్ర‌వ‌రి 12న కుంభ సంక్ర‌మ‌ణం, శ్రీ తిరుక్క‌చ్చినంబి ఉత్స‌వారంభం, ఫిబ్ర‌వ‌రి 16న వ‌సంత పంచ‌మి, ఫిబ్ర‌వ‌రి 19న ర‌థ‌స‌ప్త‌మి, ఫిబ్ర‌వ‌రి 23న భీష్మ ఏకాద‌శి, స‌ర్వ ఏకాద‌శి, ఫిబ్ర‌వ‌రి 24న శ్రీ కుల‌శేఖ‌రాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం, ఫిబ్ర‌వ‌రి 27న కుమార‌ధార‌తీర్థ ముక్కోటి ఉత్సవాలను నిర్వహిస్తారు. 
 
ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి 
 
మరోవైపు, తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి గురువారం ఏకాంతంగా జ‌రిగింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా నిర్వ‌హించారు. 
 
ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా చేప‌ట్టారు.
 
శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ ముర‌ళీకృష్ణ‌, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సూర్య‌నారాయ‌ణ రాజు, ఇంజినీరింగ్‌, అట‌వీ, విజిలెన్స్ త‌దిత‌ర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments