మే 10, 11 తేదీలలో టిటిడి ఇంజినీరింగ్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు

ఐవీఆర్
శనివారం, 9 మే 2026 (13:23 IST)
తిరుపతి: టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో వివిధ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి 2026 మే 10, 11 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 93 పరీక్షా కేంద్రాలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత పోస్ట్ లకు సంబంధించి కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఏఈఈ (సివిల్)- 93 కేంద్రాలు, ఏఈఈ (ఎలక్ట్రికల్)- 16 కేంద్రాలు, ఏఈ (సివిల్)- 42 కేంద్రాలు, ఏటీవో (సివిల్) – 42 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. 
 
పోస్టుల భర్తీకి క్రింది షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి.
పరీక్షల షెడ్యూల్
AEE (సివిల్)- 10.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
AEE (ఎలక్ట్రికల్)- 10.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
AE (సివిల్)- 11.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
ATO (సివిల్)- 11.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
 
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం రెండు గంటల ముందుగానే చేరుకోవాలని టిటిడి సూచించింది. నిర్దేశిత సమయానికి అనంతరం వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరు. అలాగే పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిస్ట్ వాచ్‌లు తదితర వస్తువులను అనుమతించరు. హాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారాన్ని టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల శాఖ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments