మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

సెల్వి
సోమవారం, 2 మార్చి 2026 (15:41 IST)
Lunar Eclipse 2026 on Holi
చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మార్చి 3, మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది. ఇందులో ముఖ్యంగా సాయంత్రం 4.34 నుంచి 5.33 గంటల వరకు సంపూర్ణ గ్రహణ కాలంగా ఉంటుంది.  అయితే, భారత్‌లో ఇది సాయంత్రం 6.20 గంటల నుండి సుమారు 27 నిమిషాల పాటు కనిపిస్తుంది. 
 
అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయించి, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం భారత్‌లో 2028 డిసెంబరు 31న మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
గ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు రేపు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో గ్రహణ సమయానికి ముందే అంటే ఉదయం 9 గంటలకే దర్శనాలను నిలిపివేసి, తిరిగి రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అటు తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకే మూసివేసి, తిరిగి బుధవారం నాడు తెరుస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్

జేజేఈ మెయిన్ -2026 ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రెండు ర్యాంకులు

Milk and ghee: రూ.7.78 లక్షల విలువైన పాలు, నెయ్యి స్వాధీనం

ప్రకాష్ రాజ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: కరాటే కళ్యాణి

రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

తర్వాతి కథనం
Show comments