Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం

Webdunia
WD PhotoWD
' హరే రామ హరే కృష్ణ.. హరే రామ హరే కృష్ణ...' శ్రీకృష్ణుని భక్తి ప్రపత్తులలో ఓలలాడుతున్న భక్తజనం అంతటా కనిపిస్తారు. భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసిమాల ధారులు గీతాకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ, పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య దేవాలయం. అదే ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యమిది.

అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య దేవాలయం వ్యవస్థాపకుడైన అభయ్‌ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద 1896వ సంవత్సరంలో కలకత్తాలోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. తన ఆధ్యాత్మిక గురువైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామిని తొలిసారిగా 1922వ సంవత్సరంలో కలకత్తాలో కలుసుకున్నారు.
WD PhotoWD
అభయ్ పట్ల ప్రత్యేక దృష్టిని కనపరిచిన భక్తిసిద్ధాంత సరస్వతి, ఆయనను వేద విజ్ఞానాన్ని బోధించే వృత్తిని చేపట్టవలసిందిగా సూచించారు. మరీ ముఖ్యంగా పాశ్చాత్యులకు శ్రీకృష్ణ సందేశాన్ని బోధించవలసిందిగా భక్తిసిద్ధాంత సరస్వతి కోరారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గురువు సూచించిన మార్గంలో పయనించే క్రమంలో 1959వ సంవత్సరంలో అభయ్ సన్యాస దీక్షను స్వీకరించారు. శ్రీకృష్ణ తత్వాన్ని పదుగురికి పంచే క్రమంలో ఆయన పూర్తి కాలాన్ని వెచ్చించసాగారు. 1966వ సంవత్సరంలో అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య (ఇస్కాన్)ను ఆయన నెలకొల్పారు. అనంతర కాలంలో ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన ఇస్కాన్ 10,000 దేవాలయ భక్తులు మరియు 2,50,000 మంది భక్త సమూహాన్ని సంతరించుకున్నది. భగవద్గీత మరియు పురాతన పురాణాలను అనుసరించి కృష్ణ తత్వ ప్రచారమే లక్ష్యంగా ఈ మహోద్యమం ప్రజలలోకి చేరుతున్నది.

WD PhotoWD
న్యూయార్క్‌లో ప్రారంభమైన భక్తి తరంగాలు ప్రపంచం నలుమూలల వ్యాపిస్తున్నాయి. అనేక దేశాలలోని భక్తుల హృదయాలలో 'హరే రామ హరే కృష్ణ సంకీర్తన' ప్రతిధ్వనిస్తున్నది. ఇస్కాన్ సమక్షంలో భక్తులకు భక్తి భావనలతో కూడిన మానసిక ప్రశాంతత లభిస్తున్నది. 'భగవద్గీత'ను అనుసరించి శాంతియుత మార్గాన్ని భక్తులు కనుగొనడం ఇక్కడే జరుగుతున్నది. ఇస్కాన్ భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు..

మాంసాహారంతో పాటు ఉల్లిపాయ, అల్లంతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలు, జూదం మరియు అక్రమ లైంగిక సంబంధాలు నిషిద్ధం.
భగవద్గీత మరియ పురాణేతిహాసాల అధ్యయనాన్ని ప్రతిరోజు గంటసేపు చేయాలి.
ప్రతిరోజూ నిర్దేశిత సంఖ్యలో మంత్రాలను (హరే రామ హరే కృష్ణ) జపించాలి.

' తీర్థయాత్ర శ్రేణి'లో ఈ వారం ఉజ్జయినీలోని ఇస్కాన్ దేవాలయాన్ని పరిచయం చేస్తున్నాము. శ్రీకృష్ణుడు తన విద్యాభ్యాసాన్ని ఇక్కడే పూర్తి చేసాడు. అద్భుతమై న
WD PhotoWD
ఈ దేవాలయం 2006వ సంవత్సరంలో నిర్మించబడింది. రాధాకృష్ణులు విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉండి భక్తిభావనను కలిగిస్తుంది. అలాగే ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదదేవుల ఆకర్షణీయమైన విగ్రహం కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నది. ప్రతి ఇస్కాన్ దేవాలయంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడ తులసి వనం ఉన్నది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వనంలోని తులసి ఆకులతో శ్రీకృష్ణునికి మాలను కడతారు. ఈ దేవాలయానికి స్వంత అతిథి గృహం కలదు. ప్రపంచ వ్యాప్తంగా నిర్మితమైన ఇస్కాన్ అతిథి గృహాలలో రెండు లేదా మూడు రోజులపాటు వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆ సమయంలో భక్తులకు కేవలం శాఖాహారాన్నిమాత్రమే అందిస్తారు. ఒకే రీతిన కనిపించే భవననిర్మాణం మరియు అంతర్గత పరిసరాలు ఇస్కాన్ దేవాలయాల ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాలన్నింటిలోనూ అనిర్వచనీయమైన ఆప్యాయతను మీరు చవిచూడవచ్చు, అటువంటి వాతావరణమే పెద్దసంఖ్యలో భక్తులను శ్రీకృష్ణ భక్తి తత్వం వైపు ఆకర్షితులను చేస్తున్నది.

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

23-06-2025 సోమవారం దినఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు

22-06-2025 ఆదివారం దినఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది....

21-06-2025 శనివారం దినఫలితాలు - బెట్టింగుల జోలికి పోవద్దు....

20-06-2025 శుక్రవారం దినఫలితాలు - మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు...