Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాధులను తొలగించే వైద్యనాధుడు

Webdunia
ఆదివారం, 15 జూన్ 2008 (16:19 IST)
FileFILE
పరమేశ్వరుని ప్రసిద్ధమైన క్షేత్రాలలో వైద్యేశ్వరుని ఆలయం ఒకటి. భక్తుల కోరిన కోర్కెలు తీర్చేదేవునిగా కొలువై వున్న వైద్యేశ్వరుడు వ్యాధులతో బాధపడుతున్నవారికి వాటినుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడని విశ్వాసం. వైద్యనాధన్ అంటే... చికిత్స చేసేవాడు... నేటి ఆధునిక కాలంలో వారినే వైద్యులని పిలుస్తున్నాం. వైద్యనాధుడు దాదాపు 4 వేల 480 రకాలైన వ్యాధులను నయం చేస్తాడని నమ్మకం.

ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రావణుడు సీతను అపహరించి తీసుకెళుతున్న సమయంలో సీతను కాపాడేందుకు ఈ ప్రదేశంలోనే జటాయువు అడ్డు తగులుతుంది. రావణుడితో హోరాహోరీగా పోరాడుతుంది. అయితే రావణుడు జటాయువు రెండు రెక్కలను తెగ నరికి సీతను కొనిపోతాడు. సీతను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనబడుతుంది.

సీతను అపహరించిన విషయాన్ని జటాయువు ద్వారా తెలుసుకుంటారు రామలక్ష్మణులు. తను మరణించిన తర్వాత తనను అదే ప్రదేశంలో ఖననం
FileFILE
చేయాల్సిందిగా రాముని వేడుకుంటుంది జటాయువు. దాని కోర్కె ప్రకారం శ్రీరామచంద్రుని చేత ఖననం చేయబడుతుంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని జటాయు కుండంగా భక్తులు పిలవటం ఆరంభించారు. కులమత విచక్షణ లేకుండా కుండంలోని విభూతిని ప్రతి భక్తుడు భక్తితో తీసుకుంటారు.

రావణుని వధించి సీతసమేతుడైన శ్రీరామచంద్రుడు ఇక్కడి పరమేశ్వరుని ఆలయంలో పూజలు నిర్వహించారని చెపుతారు. అంతేకాదు విశ్వామిత్రుడు, వశిష్టాది మహర్షులు ఈ దేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు.

కుష్టు వ్యాధికి గురైన అంగారకుడు ఈ ఆలయాన్ని దర్శించి పరమేశ్వరుని ప్రార్థించి తన వ్యాధిని నయం చేసుకోగలిగాడు. కనుకనే ఈ ఆలయం నవగ్రహ ఆలయాలలో ఒకటయింది. కుజదోషం ఉన్నవారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే వారి దోషప్రవృత్తి జరుగుతుంది. జాతక పత్రాలను అంగారకుని ముందు వుంచి ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు.

FileFILE
సంజీవిని తైలాన్ని కలిగి వున్న శక్తితో వైద్యనాధుడు ఇక్కడకు వేంచేశాడంటారు. బిల్వ పత్రాలు, సంజీవిని మరియు మట్టితో తయారుకాబడి 4 వేల 480 రకాల జబ్బులను నయం చేసే శక్తికలిగిన ఔషధంతో పరమేశ్వరుడు ఇక్కడకు వేంచేశాడు. అందువల్లనే ఆయనను వైద్యనాధునిగా పిలుస్తారు.

ఏటా లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని స్వామిని ప్రార్థిస్తారు. నేటికీ ఇక్కడ కొన్ని ప్రత్యేక పద్ధతులలో తయారుకాబడే మాత్రలు తయారవుతుండటం విశేషం. ముఖ్యంగా శుక్తపక్ష శుభముహూర్తంలో అంగశాంతన తీర్థంలో స్నానమాచరించి, దాని అడుగు భాగంలోని మట్టిని తీసుకుని, జటాయువు కుండంలోని విభూతిని దానితో కలిపి, ఆ తర్వాత దానికి సిద్ధమిర్థ తీర్థాన్ని కలపాలి.

ఈ మిశ్రమాన్ని భగవంతుని ముందు కలియబెట్టాలి. ఈ మెత్తని మిశ్రమాన్ని చిన్న చిన్న గుళికలుగా తయారుచేసి వాటిని శక్తి సన్నిధిలో వుంచి పూజ లు నిర్వహించాలి. ఆ తర్వాత వాటిని సిద్ధమిర్థ తీర్థంలో కలిపినట్లయితే ఎటువంటి వ్యాధి అయినా నయమవుతుంది. ఈ జీవితంలోనే కాదు, మరో 5 జన్మలలోనూ సదరు పూజ నిర్వహించిన వ్యక్తికి ఎటువంటి వ్యాధులు బాధలు వుండవు.

పరమేశ్వరుడు ఇక్కడ వైద్యనాధునిగా కొలవబడుతున్నాడు. కుజదోష పరిహారార్థం నిత్యం భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. అంతేకాదు ఆస్తి వివాదాల సమస్యలనుంచి బయటపడేందుకు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారని ఈ ఆలయానికి చెందిన ఓ అనుభవజ్ఞులైన గురుకులం చెపుతోంది.
FileFILE


ఈ ఆలయంలోని పుణ్యతీర్థమైన సిద్ధమిర్థ తీర్థం అత్యంత అందంగా నిర్మించబడింది. కృతయుగంలో కామధేను ఈ క్షేత్రాన్ని దర్శించి శివలింగాన్ని తల పాలతో అభిషేకించిందట. పూజ చేయగా మిగిలినపాలు ఈ ట్యాంకులోకి చేరాయనీ, అందువల్లనే దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వచ్చిందని అంటారు. దుష్టశక్తులతో బాధపడేవారు ఈ ట్యాంకులో స్నానమాచరిస్తే చాలు... వాటి నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఓ సిద్ధేంద్రుని ఆజ్ఞ మేరకు ఈ ట్యాంకులో కప్పలు కానీ, నీళ్లపాములు దరిచేరవని అంటారు.

వైద్యనాధుని నామంతోనే ఈ పట్టణం వైద్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు ఈ ప్రదేశం నాడీ జ్యోతిషానికి కూడా ప్రసిద్థి. కేవలం బొటనవేలి ముద్ర సాయంతో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను ఇక్కడి నాడీ జ్యోతిష్కులు చెపుతారు.

వైద్యేశ్వరుని ఆలయానికి ఎలా వెళ్లాలి

రైలు ద్వారా: చెన్నై- తంజావూరు రైలుమార్గంలో వైద్యేశ్వరుని రైలు స్టేషను ఉన్నది.
రోడ్డు ద్వారా: చిదంబరానికి దగ్గర... చెన్నై నుంచి సుమారు 235 కిలోమీటర్ల దూరం. చిదంబరం నుంచి 40 నిమిషాల్లో వైద్యేశ్వరుని ఆలయానికి చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉన్నది.
విమాన సౌకర్యం: చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్టు. ఇక్కడ నుంచి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

Show comments