తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా తిరువైయారులో పుణ్య కావేరి నదీ తీరాన ఒక సమాధి ఉంది. ఇది పేరుకు మాత్రమే సమాధి. కానీ స్థానికులకే కాదు.. రాష్ట్ర వాసులకు అది ఒక ఆలయం. ఇక్కడ ప్రతి ఏడాది జనవరి నెల పుష్య బహుళ పంచమి రోజున పంచరత్న కీర్తనావళి పేరుతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. ప్రపంచం నలుమూలల నుంచి కర్ణాటక సంగీత విద్వాంసులు, కళాకారులు తరలి వస్తారు. వీరంతా ఒక చోట చేరి, ఒకేసారి పంచరత్న కీర్తనలను ఆలపించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.
దక్షిణ భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన సంగీత విద్యల్లో ఒకటైన కర్ణాటక సంగీత విద్యకు ప్రకటించని సంగీత కళా పీఠంగా వెలుగొందుతోంది. తన ఇష్టదైవమైన శ్రీ రాముని స్థుతిస్తూ వేలాది కీర్తనలు ఆలపించిన పుణ్యపురుడు శ్రీ త్యాగరాజ స్వామి సమాధినే ఇక్కడ ఆలయంగా భావించి పూజలు చేస్తుంటారు. కావేరి, కుడామురుటి, వెణ్ణారు, వెట్టారు, వడారు అనే ఐదు నదుల సంగమంలో ఈ ఆలయం కొలువైవుంది.
తిరువైయారులో 1767 సంవత్సరం జనవరి పదో తేదీన జన్మించిన త్యాగరాజర్.. అతి చిన్న వయస్సు నుంచి కర్ణాటక సంగీతంపై మక్కువ చూపి, సంగీతాన్ని బాగా వంటపట్టించుకున్నాడు. కర్ణాటక సంగీతంలో ఆరితేరినప్పటికీ.. త్యాగరాజర్ ఆలపించిన గీతాలు శ్రీరాముని స్థుతిస్తూ పాడినవి కావడంతో అవి భక్తి గీతాలుగానే
WD Photo
WD
మిగిలిపోయాయి.
చిన్న వయస్సు నుంచే శ్రీరామ భక్తిగీతాలు ఆలపించడాన్ని గమనించిన తంజావూరు రాజు.. త్యాగరాజర్‌కు తన సభ ఆస్థాన గాయకునిగా నియమిస్తూ.. ఆహ్వానాన్ని పంపారు. దీన్ని తృణప్రాయంగా త్యాగరాజర్ తోసిపుచ్చారు. తన భక్తి గీతాలాపన ఆ శ్రీరామునికే సొంతమని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయన సోదరుడు త్యాగరాజర్ ప్రార్థించే శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
ఈ సంఘటనతో శోకసముద్రంలో మునిగి పోయిన త్యాగరాజర్ ప్రతి పుణ్యస్థలాన్ని సందర్శిస్తూ శ్రీరాముని స్థుతిస్తూ కీర్తనలు ఆలపించాడు. ఇలా ఒక పుణ్యయాత్రను విజయంతంగా పూర్తి చేసిన త్యాగరాజర్ చివరకు ఐదు నదులు కలిసే ఈ నదీ తీరానికి వచ్చి చేరాడు.
WD Photo
WD
కావేరీ నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్లిన త్యాగరాజర్‌కు శ్రీ కోదండరామస్వామి విగ్రహం ఒకటి లభ్యమవుతుంది. ఆ నదీ తీరంలోనే దీన్ని ప్రతిష్టించి, పూజలు చేసేవాడు. అలా కర్ణాటక సంగీతలో 24 వేల సంకీర్తనలు ఆలపించి, శ్రీ రాముని భక్తి ప్రపత్తులతో పూజించాడు.
త్యాగరాజర్ ఆలపించిన ప్రతి సంకీర్తన కర్ణాటక సంగీత రస ప్రియులను ఎంతో ఉత్సాహ పరిచేవిగా ఉంటాయి. వివిధ ప్రధాన వేదికల్లో జరిగే సంగీత కచేరిలలో త్యాగరాజ కీర్తనలు ఆలపించని కచేరి ఉండదంటే ఆశ్చర్యం చెందాల్సిన పనిలేదు. పంచరత్న కీర్తనలుగా పిలిచే సంకీర్తనలను ఎక్కువగా ఆయన జయంతి రోజున ఐదు రోజుల పాటు ఆలపిస్తారు. ఇందులో వందలాది మంది సంగీత కళాకారులు పాల్గొంటారు.
శ్రీ త్యాగరాజర్ తన 80వ యేట పరలోకానికి చేరుకున్నాడు. ఆయన పార్థీవాన్ని పాతిపెట్టిన స్థలంలోనే శ్రీ రామాలయాన్ని నిర్మించారు. శ్రీ రాముని దైవ సన్నిధినిల ో
WD Photo
WD
త్యాగరాజర్ విగ్రహాన్ని, పాదరక్షలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఆలయంలో త్యాగరాజర్ ఆలపించిన సంకీర్తనలు శిలాఫలకాలపై చెక్కించారు. ఉన్నత ఆధ్యాత్మిక భావాలతో వెలసిన ఈ ఆలయానికి ఎపుడు వెళ్లినా భక్తిభావం ఉట్టిపడుతుంది.
ఎలా వెళ్లాలి.. రైలు మార్గం.. చెన్నై నుంచి తంజావూరుకు రైలులో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అర్థ గంట సమయంలో తిరువైయారుకు చేరుకోవచ్చు.
విమానంలో.. తిరువైయారుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం తిరుచ్చి. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరువైయారుకు చేరుకోవచ్చు.
బస్సు మార్గం.. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సు సౌకర్యం వుంది.