Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల శ్రేయస్సుకై జన్మించిన యోగేంద్ర శిలనాథ్

Webdunia
FileFILE
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా శ్రీగురు యోగేంద్ర శిలనాథ్ ఆధ్యాత్మిక కేంద్రానికి తీసుకువెళుతున్నాం. ఇప్పటికీ ఆయన వాడిన చెక్క పాదరక్షలు, ఆయన పవళించిన పరుపు మనకు కనబడతాయి. దాదాపు వందేళ్లు దాటినా ఆ ప్రదేశం, అక్కడి గుహలు పరిస్థితి నేటికీ అలానే ఉన్నాయి.

యోగేంద్రబాబా మందిరానికి వెళ్లిన వారు శాంతి, ఆధ్యాత్మిక భావాలకులోనవుతారు. ఎవరైతే యోగేంద్ర శిలనాథుని భక్తితో పూజిస్తారో... వారి జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. అంతేకాదు, విజయం వారిని వరిస్తుంది, అన్ని అడ్డంకులు తొలగి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ ప్రాంతానికి వున్న పవిత్రత, ఆధ్యాత్మికతలంటే బాబాకు ఎంతో ఇష్టమని చెపుతారు భక్తులు. ఒకవేళ ఎవరైనా ఈ ప్రదేశంలోని ఆధ్యాత్మికతకు భంగం కలిగించాలని చూస్తే... వారు బాబా ఆగ్రహానికి గురికాక తప్పదు. మల్హార్ ధునిగా పిలిచే వెలుగు వద్ద, సమాధి వద్ద ఆయన శిష్య గణం వుంటారు.

వన్య మృగాల పట్ల బాబా అమితమైన ప్రేమను కలిగి ఉండేవారు. బాబా ధుని సమీపంలో తపస్సు చేస్తున్నప్పుడు అడవిలోని పలు క్రూర మృగాలు ఆయన చుట్ట ూ
FileFILE
కూర్చుని ఉండేవట. ప్రత్యేకించి ఓ పులి ఆయనను వెన్నంటి ఉండేది. బాబా ఆ పులికి ప్రత్యేకమైన బోనును కూడా ఏర్పాటు చేశారు.

ప్రజల శ్రేయస్సు కోసం బాబా ఎన్నో అద్భుతాలను చేసేవారు. అందుకే ఆయన చరిత్ర అంతా అద్భుతాలమయంగా ఉంటుంది. ప్రతి గురువారం బాబా ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. 1901 నుంచి 1921 వరకూ బాబా ఇక్కడ నివాసమున్నారు. ఆ తర్వాత ఆయనకు రిషికేష్ నుంచి పిలుపు వచ్చిందనీ, తదనుగుణంగా 1977 సంవత్సరంలో చైత్ర కృష్ణ గురువారం 14న ఆయన అవనిని వదిలి అతీత శక్తిని కలిసేందుకు వెళ్లారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

Show comments