ముంబయ్ నుంచి నాసిక్ వెళ్లేమార్గంలో ఇగాత్‌పురి అనే చిన్న గ్రామం ఉంది. ముంబై-ఆగ్రా జాతీయ రహదారి ఇగాత్‌పురి ద్వారా వెళుతుంది. సముద్ర మట్టానికి 1900 అడుగుల ఎత్తున ఈ గ్రామం ఉంది. అయితే ఉత్తర భారత్ నుంచి ముంబై మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్‌గా మాత్రమే ఇది అందరికీ తెలుసు.
నాగరికతా ప్రభావాలు ఇప్పటికీ ఇగాత్‌పురి అందాన్ని స్పర్శించలేదు మరి. ఆకాశం బంగారు, నారింజ, పసుపు రంగుల మేలు కలయికగా మారినప్పుడు ఇక్కడి ఉదయ సంధ్య వేళ అద్భుతమైన సూర్యరశ్మితో మెరిసిపోతుంటుంది. ప్రాభాత వేళ మంచు బిందువులతో పచ్చిక తడి తడిగా మెరుస్తుంటుంది. అదే సమయంలో పక్షులు కిలాకిలారావాలు మొదలెడతాయి.
ఈ ప్రాంతంలోని ఖండాలా వంటి ఇతర పర్వత ప్రాంత స్టేషన్లతో పోలిస్తే ఇగాత్‌పురిలో చలి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పర్యాటకులకు కనువిందు కలిగించే కమనీయ ప్రాంతాలకు ఇక్కడి నేల నెలవు. ఇగాత్‌పురి రెండు విషయాలకు పేరు గాంచింది. ఒకటి సుప్రసిద్ధ యోగాచార్యుడు సత్యనారాయణ గోయెంకా స్థాపించిన విపస్యన కేంద్రం కాగా, మరొకటి ఇక్కడి ఘాటన్ దేవి ఆలయం.
ఘాటన్ దేవి ఆలయం (కనుమ దేవతల ఆలయం) - ఇగాత్‌పురిలో ప్రవేశించడానికి ముందు, ఒంటె లోయను దాటిన తర్వాత కుడివేపు దిశగా ఒక చిన్న రోడ్డ ు
WD
WD
వస్తుంది. ఈ దారి వెంబడి పోతే ఘాటన్ దేవి ఆలయం వస్తుంది. ఈ రోడ్డు మీదుగా అర్థ కిలోమీటరు దాటిన తర్వాత ఈ ఆలయం వస్తుంది. ఆలయం వెనుక త్రింగాలవాడి కోట ఉంటుంది. ధుర్వార్ ఉత్వాద్, త్రిమాక్ హరిహర్ పర్వతాలు దీని వెనుక నిలబడి ఉంటాయి. చూడ్డానికి ఇది రమణీయ దృశ్యాన్ని తలపిస్తుంది.
అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని కలిగి ఉన్న ఘాటన్ దేవి ఆలయం ఇగాత్‌పురి గ్రామానికి కాస్త ముందుగా నెలకొని ఉంటుంది. విశిష్టమైన గుడిలో వెలిసిన ఘాటన్ దేవి చుట్టు పక్కల కనుమలను కాపాడుతుంటుందని స్థానికులు నమ్ముతుంటారు. పశ్చిమ కనుమలతో చుట్టబడి ఉన్న ఈ కనుమ దేవత ఆలయం భక్తులకు నయనానందకరంగా కనిపిస్తుంది.
ఈ దేవికి తొమ్మిది అవతారాలు ఉన్నాయి. ఇవి దూరసప్తాష్టిలో వివరించబడి ఉన్నాయి. వీటిలో ఘాటన్ దేవి శైలపుత్రి అవతారంలో ఉంటుంది. ఈ దేవి గురించి పురాణగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకసారి దేవి వజ్రేశ్వరి తీర్థ స్థలం నుంచి పుణే సమీపంలోని భీమశంకర జ్యోతిర్లింగం వైపుగా వెళుతూ ఈ ప్రాంతానికి విచ్చేసిందట.
WD
WD
ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలై ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుందట. చరిత్రలోకి పోయి చూస్తే మరాఠా వీరుడు శివాజీ కూడా ఈ ఆలయాన్ని సందర్శించాడు. కళ్యాణ్ నగరాన్ని దోచుకుని తిరిగి తన రాజధాని నగరమైన రాయగర్‌కు వెళుతున్న క్రమంలో శివాజీ ఈ దేవి ఆలయాన్ని సందర్శించాడని ప్రతీతి.
కంటికింపుగా కనిపించే ఆలయగోపురంతో, ప్రాకృతిక వాతావరణంతో కూడిన ఇగాత్ పురి ఆలయం ఎవరికయినా భక్తి విశ్వాసాలను పాదుకొల్పుతుంది. పర్వతలోయలో సుందరమైన ఆలయమైన ఘాటన్ దేవి ఆలయాన్న ఎవరైనా చూసి తరించాల్సిందే తప్ప వర్ణించలేరు.
గమ్య మార్గాలు వాయు మార్గం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇగాత్ పురికి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో ముంబై
WD
WD
అనుసంధానమై ఉంది. ప్రపంచంలోని పలు నగరాలనుంచి కూడా ఈ నగరానికి విమానాల రాకపోకలు సాగుతుంటాయి. ముంబైనుంచి నేరుగా టాక్సీలో ఇగాత్ పురి ఆలయానికి రావాలంటే రూ.2,000 ఖర్చు అవుతుంది.
రైలు మార్గం ముంబై విక్టోరియా టెర్మినస్ నుంచి తపోవన్ ఎక్స్‌ప్రెస్ ఇగాత్ పురి రైల్వే స్టేషన్‌కు వస్తుంది. ఇక్కడికి సమీపంలోని ప్రముఖ రైలు స్టేషన్ కసారా. రైలు మార్గం ద్వారా పలు నగరాలకు ఇది అనుసంధానమై ఉంటుంది. కసారా నుంచి ఇగాత్ పురికి నేరుగా అరగంట వ్యవధిలో టాక్సీలో రావచ్చు. దీనికి రూ.300 ఖర్చు అవుతుంది.
బస్సు మార్గం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పొరుగున ఉన్న అన్ని ప్రధాన నగరాలనుంచి ఇగాత్ పురికి బస్సులను పంపుతుంటుంది. ముంబయ్, నాసిక్, కసారా ప్రాంతాలనుంచి ఇక్కడికి బస్సులు వస్తుంటాయి. ముంబయ్ నుంచి కసారాకు టూరిస్టు బస్సులు వస్తుంటాయి. వీటిలో రావాలంటే రూ.500లు ఖర్చవుతుంది.