Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన కర్ణేశ్వరాలయం

Webdunia
ఈ వారం తీర్థయాత్ర సీరీస్‌లో మీకు పురాతన కర్ణేశ్వరాలయాన్ని చూపించబోతున్నాము. చరిత్రలోకి చూస్తే కౌరవులు మాళ్వ ప్రాంతంలో పలు ఆలయాలను నిర్మించారు. వీటిలో కర్ణేశ్వరాలయం ఒకటి. ఇది సెంధల్ నది గట్టుపై నెలకొని ఉంది. కర్నావత్ పుర రాజైన కర్ణుడు ఈ ప్రాంతంలో పేదలకు, ఆపన్నులకు డబ్బులు, వస్తువులు దానం చేస్తూ ఆదుకునేవాడు. దీంతో ఆలయానికి ఇతడి పేరు స్థిరపడిపోయింది.

మరో కథనం ప్రకారం కర్మ అనే అతడు కూడా ఈ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. తన ఇలవేల్పును ఈయన భక్తిప్రపత్తులతో పూజించేవాడు. దేవతను సంతృప్తిపర్చేందుకు ఇతడు ప్రతిరోజూ తన ప్రాణాన్ని బలి ఇచ్చేవాడు. అతడి బలిదానానికి మెచ్చిన దేవత అతడి శరీరంపై కొన్ని అమృత బిందువులను వదిలి తిరిగి అతడికి జీవం పోసేది. అలాగే ఆమె 50 కిలోల బంగారాన్ని కూడా అతడికి కానుకగా ఇచ్చేది. ఈ బంగారాన్నే కర్ణ రాజు ప్రజలకు పంచిపెట్టేవాడు.
WDWD


మధ్యప్రదేశ్‌లోని మాల్వా, నిమద్ ప్రాంతాల్లో కౌరవులు పలు ఆలయాలను నిర్మించినట్లు ప్రతీతి. అయితే వీటిలో అయిదు దేవాలయాలు మాత్రమే బాగా ప్రసిద్ధి కెక్కాయి. అవి ఓంకారేశ్వర్‌లోని మహామల్లేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, నేమావర్ లోని సిద్ధేశ్వర్, బీజ్వీర్‌లోని బీజేశ్వర్, కర్ణావత్ లోని కర్ణేశ్వర్.

ఈ ఆలయాల గురించి ఆలయ పూజారి హేమంత్ దుబే ఆసక్తికరమైన కథను చెప్పాడు. పూజారి చెప్పిన దాని ప్రకారం పాండవుల తల్లి కుంతి ఇసుకతో చేసిన శివలింగాలను పూజించేది. పాండువులు ఇందుకు కారణం అడిగినప్పుడు, ఇక్కడ అన్ని ఆలయాలను కౌరవులు నిర్మించారని, అందుచేత వాటిలో తాను పూజలు
WDWD
చేయలేనని చెప్పిందట. తల్లి ఇలా చెప్పడంతో పాండవులు ఒకే ఒక రాత్రిలో పైన పేర్కొన్న ఆలయాల రూపాన్ని మార్చి కట్టారట.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి, అనేక ఇతర పవిత్ర స్థలాలకు వెళ్లడానికి సొరంగ మార్గాలు ఉండేవని చెబుతుంటారు. అయితే తర్వాత్తర్వాత భద్రత రీత్యా గ్రామస్తులు ఈ సొరంగాలను మూసివేశారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ప్రాంతంలో పలు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో కర్ణేశ్వర దేవుడి ప్రదర్శన ఈ నగరం గుండా సాగిపోతుంది.

గమ్యమార్గాలు

కర్నావట్ నగరానికి సమీపంలోని విమానాశ్రయం ఇండోర్‌లో ఉంది.

ఇండోర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో దేవస్‌ రైలు స్టేషన్ ఉంది. ఇక్కడినుంచి కర్ణావత్ వెళ్లేందుకు కిరాయికి బస్సులు, టాక్సీలు లభ్యమవుతాయి.

దేవస్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని చాప్రాకు రోడ్డు మార్గంలో బస్సులు, టాక్సీలు దొరుకుతాయి. కర్ణావత్ గ్రామం చాప్రా నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

Show comments