Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాలు హరించే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం

Webdunia
చిత్తూరు జిల్లాకు 12 కి.మీ దూరలోని బహుదా నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయంలోని వినాయకుడిని స్థానికుడు ప్రమాణాల దేవుడని పిలుస్తారు. నేరాలు చేసి, ఇచ్చిన మాట తప్పిన వారు ఈ ఆలయంలో మాత్రం స్వామి మహిమ చేత నిజాలే చెప్తారట. అలా చెప్పడం ద్వారా వారి పాపాలు నశించిపోతాయంటారు భక్తులు.

ఒకవేళ నిజాన్ని దాచి అసత్యాలు చెబితే వారిని స్వామి ఊరికే వదలడని ప్రతీతి. కాణి అంటే తడిసిన నేల అని అర్థం. పాకమ్ అంటే తడినేలలోకి నీళ్ల ధార అని అర్థం. గణనాధుడు ఈ ఆలయంలో బావినుంచి వెలిశాడు కనుక ఆయనకు స్వయంభూ వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది. ఆయన వెలసిన బావిలోని పవిత్ర జలాన్ని భక్తులు తీర్థంలా సేవించి తరిస్తున్నారు.

స్థల పురాణం:
పూర్వ కాలంలో గుడ్డి, మూగ, చెవిటి అంగవైకల్యాలు కలిగిన ముగ్గురు సోదరులు కాణిపాకం ప్రాంతంలో నివసించేవారు. వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు. ఆ కాలంలో వ్యవసాయం చేసేందుకు గూడ పద్ధతి ద్వారా నీటిని తోడుకునేవారు. బావి ప్రక్కగా గొయ్యి తవ్వి ఇద్దరు మనుషులు బావిలోంచి నీటిని తోడి పోసేవారు.

అంగవైకల్యం కలిగిన వీరు ముగ్గురు సోదరులు కష్టాలు పడుతూ ఇలానే జీవితం సాగిస్తున్నారు. ఒకనాడు ఆ బావి నీరు ఇంకిపోయే దశకు చేరుకుంది. దీంతో వ్యవసాయం ఎలా సాగించాలో అక్కడి వారికి అర్థం కాలేదు. ఓ రోజు ముగ్గురి సోదరుల్లో ఒకరు బావిలోకి దిగి త్రవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో రాతి విగ్రహంలాంటిదేదో అతని పారకు తగిలింది.

అది ఏమిటో చూసే లోపే అక్కడ నుంచి రక్తం రావడం ప్రారంభమయింది. నిముషాల్లోనే బావి మొత్తం రక్తంతో నిండిపోయింది. మరుక్షణమే అంగవైకల్యంతో బాధపడుతున్న ఈ ముగ్గురి లోపాలు మాయమై మామూలు మనుషులయ్యారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడకు చేరుకుని బావిని త్రవ్వే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు.

అక్కడ నుంచి స్వయంభూ వినాయకుడు ఉద్భవించాడు. అప్పట్నుంచీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

Show comments