Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరశురాముని జన్మస్థలం... షహజహన్‌పూర్

Webdunia
ఆదివారం, 27 ఏప్రియల్ 2008 (16:31 IST)
WD PhotoWD
ఉత్తరప్రదేశ్‌లో ప్రబలమైన షహజహన్‌పూర్‌లోని పరశురాముని జన్మ స్థలాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తున్నాం. జలాలాబాద్ నుంచి 30 కి.మీ దూరంలో పరశురాముని జన్మస్థలం ఉంది. వెయ్యి సంవత్సరాల పాటు అత్యంత పేరు ప్రఖ్యాతులతో వర్థిల్లిన ఈ స్థలాన్ని ప్రస్తుతం ఖేదా పరశురామపురి అని పిలువబడుతోంది. ఈ ప్రదేశంలోనే పరశురాముడు జన్మించినట్లు అక్కడి ప్రజల విశ్వాసం. ఈ స్థలాన్ని ముఖ్యమైన పర్యటక ప్రాంతంగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఈ పుణ్యస్థలాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కూడా కీలక మలుపులు తిరుగుతుంటాయి. ఇందులో విశేషమేమిటంటే... పరశురాముని శౌర్య, పరాక్రమాలు, ఆయన మహిమను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని స్థానిక బ్రాహ్మణులు తాపత్రయ పడుతారు. దీంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ముందుగా పరశురాముని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ప్రత్యేక పూజలు చేయించే
WD PhotoWD
అభ్యర్థులకు పూజాలు తమ దీవెనెలు అందిస్తారు.

ఈ నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ ఆలయ జీర్ణోద్ధారణ పనులు చేపట్టగా ఇవి వేగవంతంగా సాగుతున్నాయి. ఇక ఈ పుణ్యస్థల చరిత్రను పరిశీలిస్తే జలాలుద్ధీన్ చివరి కుమారుడు హబీస్ ఖాన్‌కు వివాహం నిశ్చయమవుతుంది. హబీస్ ఖాన్‌కు సతీమణిగా వచ్చే వారికి ఈ స్థలం జలాలుద్దీన్‌చే బహుమతిగా ఇస్తారు. దీంతో ఈ ఆలయం పరశురామపురం నుంచి జలాలాబాద్‌తో కలిసిపోతుంది.

WD PhotoFILE
ఈ ఆలయానికి మరో విశేషముంది. ఆలయంలో ఉన్న ఒక శివలింగానికి ముందు పరశురాముని విగ్రహం అమరి ఉంటుంది. ఈ శివలింగాన్ని ప్రతిష్టించి, లింగానికి ముందు పరశురాముడు కూర్చున్నట్లు, ఆ తర్వాతనే ఈ ఆలయం నిర్మించినట్టు ఆలయ చరిత్ర పేర్కొంటోంది. సుమారు 20 అడుగుల ఎత్తు కలిగివుండే ఈ ఆలయం, పలు సార్లు మహమ్మదీయుల పాలకులచే కూల్చివేతకు కూడా గురైంది. అయితే భక్తులు అదే ప్రాంతంలో పరశురాముని ఆలయాన్ని పునర్నిర్మించారు.

అదేవిధంగా ప్రతీసారి ఆలయాన్ని నిర్మించేటప్పుడు వివిధ వస్తువులు బయటపడేవి. ఈ తరహాలో ఓ సారి ఎనిమిది అడుగుల గోవు విగ్రహాన్ని వెలికి తీశారు. ఇలా బయల్పడిన విగ్రహాన్ని ఆలయ ప్రవేశద్వారానికి ఎడమవైపున ప్రతిష్టించారు. ఆలయానికి పశ్చిమంలో కొలనుతో కూడిన ద్రాక్షాయణి కోవెల వెలసి ఉంది.
WD PhotoWD
ద్రాక్షాయణి ఆలయానికి చేరుకుని ప్రార్థించే భక్తులకు సకల సౌభాగ్యాలతో పాటు, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీక.

అంతేకాకుండా కొత్తగా వివాహమైన వధూవరులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు కూడా చేస్తారు. దూరపు ప్రాంతాల నుంచి పరశురాముని ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. తమ కోర్కెలు తీరిన భక్తులు మొక్కులు తీర్చుకుంటుంటారు. మహంత్ సత్యదేవ్ పాండ్య పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో మరమ్మతు కార్యక్రమాలు, భవనాన్ని ఆధునికీకరించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగంణంలో 24 రకాలైన నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టించారు.

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

TTD vaikunta ekadashi 2025 : ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

Show comments