Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాస్‌లో కొలువు తీరిన భవాని మాతలు

Webdunia
FileFILE
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నగరం తులజా భవాని, చాముండ మాత ఆలయాలకు ప్రసిద్ధి పొందింది. ఈ నగరంలోని చిన్న పర్వతంపై ఈ రెండు ఆలయాలు వెలిశాయి. ఈ దేవతలు పెద్దమ్మవారు, చిన్నమ్మవారు అనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. ఈ ఇద్దరు దేవతలూ అక్కచెల్లెళ్లని ఈ ఆలయం పూజారి చెప్పారు. ఒకసారి ఈ ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ఫలితంగా పెద్దమ్మవారు ఆలయం వదలి చిన్నమ్మవారు వెలిసి ఉన్న కొండకు మరోవైపుకు వెళ్లిపోయింది.

ఈ పరిస్థితి గమనించిన హనుమంతుడు మరియు భైరవుడు ఈ ఇద్దరు దేవతలను ఈ స్థలం వదిలి పోవద్దని కోరారు. అప్పటికే పెద్దమ్మవారి శరీరంలో సగభాగం నేలలో కూరుకుపోయింది. ఇలా చిట్ట చివరలో వారు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో వారి విగ్రహాలు ఈ నాటికీ కనిపిస్తుంటాయి.

చాలాకాలంగా సాగుతున్న విశ్వాసం ప్రకారం ఈ విగ్రహాలు స్వయం భూ విగ్రహాలు అని జనం నమ్ముతున్నారు. స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థిస్తే అలాంటి వారి కోరికలు ఇక్కడ నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. చరిత్ర ప్రకారం దేవాస్ నగరాన్ని ఏకకాలంలో రెండు రాజవంశాలు పాలించాయి. ఒకటి హోల్కర్ రాజవంశం రెండ ు
FileFILE
పన్వార్ రాజవంశం. తులజా భవాని హోల్కర్ రాజవంశాన్ని రక్షించే దేవత కాగా, చాముండా దేవి పన్వార్ రాజవంశాన్ని సంరక్షించే దేవత.

ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు భైరవదేవుడిని కూడా పూజిస్తారు. ఎందుకంటే భైరవుడికి మొక్కుకోకుంటే ఆలయంలో పూజ పూర్తయినట్లు కాదని నమ్మకం. నవరాత్రుల్లో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. ఆ రోజుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా...

విమానమార్గం - సమీప విమానాశ్రయం ఇండోర్-35 కిలోమీటర్లు-లో ఉంది.

రోడ్డుమార్గం - ఈ ఆలయం ఆగ్రా-ముంబై ఎన్‌హెచ్3లో ఉంది. ఇండోర్, ఉజ్జయిని పట్టణాలకు 35 కి.మీ దూరంలో ఉంది.

రైలుమార్గం - ఇది ఇండోర్-ఉజ్జయిని బ్రాడ్ గేజ్ లైన్‌లో ఉంది.

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Show comments