Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెజురిలోని ఖండోబా ఆలయం

Webdunia
తీర్థయాత్రలో భాగంగా, ఈ వారం జెజురిలోని ఖండోబా ఆలయ ప్రాశస్త్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్రంలోని ఆలయాల్లో జెజురిలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరాఠీలో ఈ ఆలయాన్ని ఖండోబాచ్చి జెజురిగా పిలుస్తారు. మహారాష్ట్రంలోని పురాతన గిరిజన తెగల్లో ధంగార్ ఒకటి. వీరి ఆరాధ్యదైవమే ఖండోబా. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం నవ దంపతుల జంట ఈ ఆలయాన్ని సందర్శించి, దర్శించుకుంటే మేలు చేకూరుతుందనే వాదన ఉంది.

పూణె-బెంగుళూరు జాతీయ రహదారిలో ఉన్న ఫల్తాన్ పట్టణ సమీపంలో జెజురి ఉంది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై వుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 200 మెట్లు ఎక్కాల్సి వుంటుంది. ఈ కొండపై ఉన్న ఆలయ ప్రాంగణం చారిత్రాత్మకమైన దీప మాలను చూడొచ్చు. అలాగే, కొండ అగ్రభాగం నుంచి జెజురి పట్టణం ఎంతో అందంగా కనిపిస్తుంది.

ప్రధానంగా ఈ ఆలయాన్ని రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి మండపం. మరొకటి గర్భగుడి. ప్రార్థనలు చేసేందుకు
WDWD
మండపాన్ని భక్తులు ఉపయోగిస్తారు. గర్భగుడిలో ఖండోబా విగ్రహం ఉంది. ఈ ఆలయంలో కాంస్యంతో చేసిన 10 x12 అడుగుల సైజులో ఉండే తాబేలు ఉంది. అలాగే చరిత్ర ప్రసిద్ధిగాంచిన వివిధ రకాల ఆయుధాలు ఆలయంలో ఉన్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నిర్వహించే కత్తి పోటీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే ఎక్కువ సమయం కత్తిని ఎత్తిపట్టుకుంటారో వారని విజేతగా ప్రకటిస్తారు.

జెజురి ప్రాంతానికి ఒక చరిత్ర కూడా ఉంది. ఛత్రపరి శివాజీ తన తండ్రి షాహాజిని చాలా కాలం తర్వాత ఇక్కడే కలుసుకున్నట్టు ఇక్కటి వాసులు పేర్కొంటారు. ఈ ప్రాంతంలో తిష్టవేసిన మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసేందుకు వారిద్దరు కొద్ది కాలం ఇక్కడే నివశించి, వివిధ ప్రణాళికలు రూపొందించినట్టు ఇక్కడి వారు చెపుతారు.

WDWD
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి హాల్కర్ వంశానికి కుటుంబ దైవం కూడా జెజురి. ప్రతియేడాది ఇక్కడ యాత్ర పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర, మార్గశిర, పుష్యమి, మాఘ మాసాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయాల్లో లక్షలాది మంది భక్కులు ఆలయానికి ఇచ్చి తమ ఇష్టదైవాన్ని సందర్శించుకుంటారు.

ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: పూణె నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెజురి ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం.. పూణె-మిరాజ్ రైల్వే మార్గంలో జెజురి రైల్వే స్టేషన్ ఉంది.
విమానమార్గం.. జెజురి ప్రాంతానికి పూణె విమానాశ్రయం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య..

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

Show comments