ఏప్రిల్ 1వ తేదీన 'ఫూల్స్ డే' అని ఎందుకు అంటారు..?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:24 IST)
ఏప్రిల్ వచ్చేసింది.. అంటే.. ఈరోజు మనకు తెలిసిన వారిని ఎలా ఫూల్ చేయాలని ఆలోచించి మరీ అందుకు అనుగుణంగా ప్లాన్ చేసి వారిని ఫూల్స్‌ను చేస్తుంటాం. అసలు నిజానికి ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసుకుందాం..
 
ఇప్పటి కాలంలో కొత్త ఆంగ్ల సంవత్సాన్ని జనవరి 1వ తేదీన జరుపుకుంటున్నాం. కానీ, ఒకప్పటి కాలంలో ఏప్రిల్ 1వ తేదీన రోమన్లు, యురోపియన్లు కొత్త సంవత్సరం ఆరంభ తేదీగా జరుపుకునేవారు. అయితే 1582వ సంవత్సరంలో పోప్ గ్రెగరీ అనే చక్రవర్తి కొత్త క్యాలెండర్‌ను తయారు చేయించారు. అలా క్యాలెండర్‌నే జియోర్జియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. 
 
ఈ క్యాలెండర్ ప్రకారమే కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని ఆ రాజుగారు ఆదేశించారట. అందువలనే అందరూ అప్పటి నుండి జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటూ వచ్చారు. కానీ, సదరు రాజు గారు పెట్టిన ఈ నిబంధన కొందరికి మాత్రం నచ్చలేదట. దీంతో వారు ఏప్రిల్ 1వ తేదీన్నే నూతన సంవత్సరాన్ని యథావిధాగా జరుపుకునేవారు.
 
ఈ క్రమంలో రాను రాను జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరాన్ని జరుపుకునే వారు పెరిగిపోయి, ఏప్రిల్ 1వ తేదీన నూతన సంవత్సరం జరుపుకునే వారి సంఖ్య తగ్గుత్తూ వచ్చింది. దాంతో అందరూ ఏప్రిల్ 1వ తేదీన కొత్త సంవత్సరాన్ని జరుపుకునే వారిని మూర్ఖులలా చూడడం మొదలుపెట్టారు. క్రమంగా వారిని ఫూల్స్ అనడం ప్రారంభించారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీన కొత్త సంవత్సరం జరుపుకునేవారిపై ఫూల్స్ అనే ముద్ర పడింది. ఇక రాను రాను ఫూల్స్ డేగా మారింది. ఇదే.. ఏప్రిల్ 1వ తేది ఫూల్స్ డే కావడానికి వెనుక ఉన్న అసలు కథ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు

Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే

ఐఏఎస్ అధికారిణికి తప్పని వేధింపులు - ఐఏఎస్ భర్తపై ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

సంకష్టహర చతుర్థి రోజున సంకష్ట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తే..?

Sankatahara Chaturthi: శనివారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే శనిదోషాలు పరార్

07-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య పరిష్కారం అవుతుంది..

తర్వాతి కథనం
Show comments