Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివబాబా జాతర: లక్షల మేకల బలి

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2008 (20:25 IST)
WD
శివబాబా జాతర... దట్టమైన సాత్పురా అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా నిర్వహించబడుతుంది. చూసేందుకు అది మామూలు ఉత్సవంలా కనబడినా ఇందులో కొన్ని వాస్తవాలు దాగి ఉన్నాయి. ఈ కారణంగానే ఈ జాతరకు మరింత ప్రాముఖ్యత చేకూరింది. 'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి ఖాద్వాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివబాబా జాతర గురించి తెలియజేయబోతున్నాం.

భక్తులు వివిధ రకాల కోర్కెలతో ఈ ఆలయానికి వస్తుంటారు. అంతేకాదు తాము కోరిన కోర్కెలు నెరవేరినందుకుగాను శివబాబాకు మేకలను బలి ఇస్తుంటారు. తమను దీవించే శివబాబా అతీత శక్తులను కలిగి ఉన్నాడని భక్తుల నమ్మకం. ఆ పరమ శివుని అవతారమే ఈ శివబాబా అని ప్రజలు భావిస్తారు. ఇదో శక్తివంతమైన ప్రాంతమని ఆలయానికి సమీపంలో నివాసముంటున్న జోగినాథ్ చెప్పాడు. కోర్కెలను నెరవేర్చుకోవాలనుకునేవారు ఎవరైనా ఒక్కసారి శివబాబాను దర్శించుకుని వాటిని సాధించుకోవచ్చు.
WD


ఇలా కోరిన కోర్కెలు నెరవేరినవారు బంధుమిత్రులతోసహా ఈ దేవాలయానికి తండోపతండాలుగా వస్తారు. తమతోపాటు తెచ్చే మేకలను వేపాకులు, పూలతో అలంకరించి శివబాబా సన్నిధికి చేరుస్తారు. పూజారి పవిత్ర జలాన్ని ఆ మేకలపై చిలకరించిన అనంతరం వాటిని శివబాబా విగ్రహానికి బలి ఇస్తారు.

WD
బలిఇచ్చిన మేకల మాంసాన్ని భుజించటం... మరింత పుణ్యాన్ని కట్టబెడుతుందని భక్తుల విశ్వాసం. ఆ మాంసాన్ని ఆ ప్రదేశం దాటి మరోచోటకు తీసుకెళ్లటానికి వారు అనుమతించరు. ఒకవేళ మాంసం మిగిలినట్లయితే పేద ప్రజలకు పంచుతారు. మొత్తం మీద ప్రతి ఏటా ఈ జాతరలో దాదాపు 2 లక్షల మేకలను భక్తులు బలి ఇస్తారని ఒకరు చెప్పారు.

రక్త మాంసాలతో తడిసే ఆ ప్రాంతంలో మనం ఒక్క ఈగను కానీ లేదా కనీసం ఓ చీమనైనా చూడలేము. అదంతా శివబాబా దీవెనల మహిమ వల్లనే సాధ్యమౌతోందని భక్తుల విశ్వాసం. ఇది తెలుసుకున్న మేము ఆ ప్రాంతాన్నంతా నిశితంగా పరిశీలించాం... చిత్రం... నిజంగానే ఒక్క ఈగకానీ... చీమకానీ మాకు కనబడలేదు.
WD


ఇక్కడ చర్చించుకోదగ్గ అంశమేమిటంటే.... అసలు మేకలను బలి ఇవ్వటం వల్ల ఏ దేవుడైనా సంతోషిస్తాడా? వెబ్‌దునియా తెలుగు వీక్షకులైన మీ నుంచి ఈ అంశంపై అభిప్రాయాలను కోరుతున్నాం... తప్పక తెలియజేస్తారు కదూ...

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

Show comments