Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాప ఫలితం... శిలలుగా మారిన ఊరి జనం

Webdunia
సోమవారం, 9 జూన్ 2008 (20:08 IST)
WD
ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి పురాతన కాలంలో శాపానికి గురైన ఓ గ్రామానికి మిమ్మల్ని తీసుకువెళుతున్నాం. శాపం కారణంగా గ్రామం మొత్తం రాయిగా మారింది. గ్రామంలో నివశించిన పశు, పక్ష్యాదులు, మానవులు మొత్తం రాయిగా మారారు. పట్టణమంతా శాశ్వతంగా భూమిలో పాతుకుపోయింది. దేవాస్ తాలుకా పరిధిలోని ఆ గ్రామాన్ని గంధర్వపురిగా పిలుస్తున్నారు. బౌద్ధమత ప్రాశస్త్యంతో వెలుగు చూసిన ఈ పట్టణం అంతకు ముందు చంపావతిగా పిలువబడుతూ వచ్చింది. చంపావతి తనయుడు గంధర్వసేనుడి పేరుమీద ఆ తర్వాత అది గంధర్వపురిగా మారింది. ఈ గ్రామం నేటికీ గంధర్వపురి పేరుతోనే కొనసాగుతోంది.

స్థానికుల అభిప్రాయం ప్రకారం...మాల్వా క్షత్రియుడైన గంధర్వసేనుడిని గంధర్వభిల్‌గా కూడా పిలుస్తున్నారు. ఆయన శాపంతో గ్రామమంతా రాయిలా మారిపోయింది. దీనికి సంబంధించి చాలా కథనాలు వెలుగు చూస్తున్నప్పటికీ, స్థానికుల కథనమంతా దాదాపు ఒకే రకంగా ఉంటోంది. గంధర్వ సేనుడు నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారిని పెళ్లాడగా, శాత్రాని ద్వారా శంఖ్, రాజా విక్రమాదిత్య, భర్తృహరిలను సంతానంగా పొందాడు.
మీరంతా శిలలవుదురుగాక...
  గంధర్వసేనుడు గాడిద శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించే సమయంలో అతని శరీరాన్ని సజీవంగా తగులబెట్టారు. దీంతో గంధర్వసేనుడు ఆ పట్టణంలో నివశించేవారెవరైనా రాయిగా మారాల్సిందేనని శపించాడు.      


స్థానికుడైన కమల్ సోని మాట్లాడుతూ ఇది పురాతన పట్టణమైనందున ఈ స్థలం ఎపుడు పాతుకుపోయిందో, అక్కడి పాత రాతి విగ్రహం అక్కడ ఎపుడు వెలిసిందే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదన్నారు. విక్రంసింగ్ కుష్వా వివరిస్తూ తన అభీష్టానికి వ్యతిరేకంగా రాజు కుమార్తె గంధర్వసేనుడిని వివాహమాడింది. ఉదయం వేళలో గాడిదగా కన్పించే గంధర్వ సేనుడు రాత్రి వేళలో ఆ చర్మం వీడి అందమైన యువరాజుగా కన్పించేవాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు గంధర్వసేనుడు వదిలిన చర్మాన్ని తగులబెట్టాలని తన సేవకులను ఆదేశించాడు.

అయితే గంధర్వసేనుడు గాడిద శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించే సమయంలో అతని శరీరాన్ని సజీవంగా తగులబెట్టారు. దీంతో గంధర్వసేనుడు ఆ పట్టణంలో నివశించేవారెవరైనా రాయిగా మారాల్సిందేనని శపించాడు. దీనిపై గ్రామ పెద్ద విక్రమ్ సింగ్ చౌహాన్ వద్ద మాట్లాడాం. ఆయన కూడా శాపగ్రస్త పట్టణం భూమిలో పాతుకుపోయిన విషయం నిజమేనన్నారు. గ్రామంలోని భూగర్భంలో వేలాది రాతి శిలలు ఉన్నాయి.

WD
1996 లో ముఖ్యమైన శిలలతో ఓ పురాతన వస్తు ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు. దాని బాధ్యతలను నిర్వహిస్తున్న రాంప్రసాద్ కుండలివా మాట్లాడుతూ ఈ ప్రదర్శన శాలలో 300 విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. భూమిలో తవ్వకాలు జరిపిన సమయంలో పలు విగ్రహాలు బయటపడగా, గ్రామస్తుల సమాచారంతో వాటిని గ్యాలరీలో అమర్చామన్నారు.

బుద్ధుడు, మహావీరుడు, విష్ణు విగ్రహాలతో పాటు గ్రామస్తులు ప్రతిరోజూ గ్రామీణ వృత్తులను ప్రతిబింబించే అనేక రాతి శిలలు కూడా ఉన్నాయి. సుమారు 300 రాతి విగ్రహాలు మ్యూజియంలో ఉంచారు. వెయ్యి శిలల వరకు చోరీకి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అసలు ఓ శాపం ద్వారా పట్టణమంతా రాయిగా మారగలదని మీరు విశ్వసిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు మాకు పంపండి.

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

హంతకులు కూడా ఇలా కొట్టరు... తమిళనాడు ఖాకీలపై హైకోర్టు సీరియస్

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Show comments