Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలుతో తాకినంతనే వ్యాధి మటు 'మాయం'

Webdunia
WD PhotoWD
ఈ రోజుల్లో నమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఔషధాల ద్వారా వ్యాధులు నయం కావడం జగద్వితమే, కానీ స్పర్శ ద్వారా, ఔషధ గుణాలు ఏమాత్రంలేని పవిత్ర తీర్థంతో వ్యాధులు నయమవుతాయా? సాధువును పోలి ఉండే ఒక వ్యక్తి తన వేలిని రోగి శరీరానికి తాకించటం ద్వారా కొంత శక్తిని పంపి మొండి వ్యాధులు నయం చేస్తున్న వైనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం

' బ్రహ్మ జ్ఞానం' - ఆధ్యాత్మిక శక్తులు... విశ్వ శక్తిని ఉపయోగించి ఈ వైద్య ప్రకియ జరుగుతున్నది. ఈ ప్రక్రియ ద్వారా వందలాది మంది రోగులు ఉపశమనం పొందుతున్న కేరళలోని ఒక ప్రాంతానికి మేము వెళ్ళాము. అక్కడ బ్రహ్మ గురువుగా ప్రజలచే పిలవబడే ఎమ్‌.డి.రవి మాస్టర్‌ తన వేలి స్పర్శతో రోగులకు స్వస్థత చేకూరుస్తున్నాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి తరతమభేదం లేకుండా ఉచితంగా వైద్యం చేస్తున్నాడు.

ఎమ్.డి.రవి మాస్టర్‌ను వైద్యుడని అనుకుంటే పొరపాటే. సాదాసీదా చదువును అభ్యసించిన ఒక టైలర్ ఈ రవిమాస్టర్. ఆయన చెప్పిన దానిని అనుసరించి మనిషికి సంక్రమించే వ్యాధులు లేదా కష్టాలకు అతడు లేదా ఆమె గత జన్మలో ఆచరించిన కర్మలపై ఆధారపడి ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రస్థానంలో అత్యున్నత స్థానానిక ి
WD PhotoWD
చేరుకున్న ఆమె లేదా అతడు దేహ సంబంధిత హద్దులను దాటి ఉత్తమ గతిని చేరుకుంటారు.

రవి మాస్టర్ స్వస్థత కేంద్రాన్ని బ్రహ్మ ధర్మాలయమని పిలుస్తారు. ధర్మాలయం కొలువైన చంగనశేరి, కేరళలోని త్రివేండ్రానికి 135 కి.మీ.ల దూరంలోను, కొచ్చిన్ నుంచి 87 కి.మీ.ల దూరంలో కొట్టాయం జిల్లాలో ఉంది. ప్రార్ధనలు చేసే సమయంలో తాను దేవతలందరితో సంభాషిస్తానని రవి మాస్టర్ చెప్పుకొచ్చారు. కానీ "నేను మనిషి రూపంలోని దేవుడిని కాను" అని ఆయన తన అనుయాయులకు కుండ బద్దలు కొట్టినట్లు చెపుతుంటారు. 'మానవసేవే మాధవ సేవ' అన్న ఆర్యోక్తిని ఆచరించడమే తన జీవిత పరమార్థమని రవి మాస్టర్ వ్యాఖ్యానించడం గమనార్హం. నిజానికి వ్యాధి నివారణలో బ్రహ్మగురువు ఎలాంటి ఔషధాలను వాడరు ఒక్క 'బ్రహ్మ జ్ఞానం' తప్ప.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలాంటి వ్యాధులనైనా తాను నయం చేయగలనని అతను చెపుతున్నాడు. అంతేకాదు దీర్ఘకాలికంగా వేధిస్తున్న జబ్బులను తన చేతికున్న బ్రహ్మశక్తి‌తో నయం చేయవచ్చని అంటున్నారాయన. ఎంతకీ నయంకాని సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను సైతం తాను నయం చేశానని చెపుతున్నారు.

WD PhotoWD
కేరళలోని కొట్టాయం జిల్లాలో చంగనస్సరి ఆశ్రమంలోని బ్రహ్మ చికిత్స కేంద్రంలో ఆయన ఈ చికిత్సలను అందిస్తున్నారు. ఆయన ఆశ్రమం వద్ద వివిధ రోగాలు, మానసిక రుగ్మతలతో బాధపడేవారు చికిత్స కోసం బారులు తీరి నిలబడటం మా కళ్లారా చూశాము. అయితే ఆశ్రమంలో ప్రత్యేకంగా ఏ దేవుడూ లేడు. అక్కడ పరమేశ్వరుడు, అల్లా లేదా యేసు దేవుళ్లకంటే మించిన విశ్వశక్తి ఏదో ఉందని నమ్మకం.

రోగంతో బాధపడేవారు చికిత్స నిమిత్తం ఆయన వద్దకు వచ్చిన సమయంలో ఆయన ముఖం వైపు నేరుగా దృష్టి సారించలేరు. అందుకు కారణం ఆయన నుదురు, చేతుల నుంచి వెలువడే శక్తి అంతటి శక్తివంతమైనదిగా ఉంటుందని నమ్మకం. చికిత్స సమయంలో రవి మాస్టర్ రోగులకున్న రుగ్మతలను పట్టి వదిలిస్తారు.

ఫలితంగా రోగి వాటి నుంచి బయటపడతాడు. అన్ని జబ్బులు వ్యతిరేఖ గుణాల నుంచే ఉద్బవిస్తాయంటారాయన. భయంకరంగా పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఓ రోగిని మామూలు స్థితికి తీసుకురావటాన్ని మేము గమనించాము.

రవిమాస్టర్ బ్రహ్మగురుగా ఎలా మారారంటే....
కొట్టాయం జిల్లాలో తిరువాంచూర్‌లో 1953వ సంవత్సరంలో రవి మాస్టర్ జన్మించారు. బాల్యం నుంచే తనకున్న శక్తిని తన మిత్రులు, బంధువుల వద్ ద
WD PhotoWD
ప్రదర్శించేవాడు. పెరిగి పెద్దవాడైన రవి మాస్టర్ టైలరింగ్ వృత్తిలో స్థిరపడినప్పటికీ తనకున్న శక్తి విషయంలో మరింత పట్టు సాధించేందుకు కృషి చేశారు. క్రైస్తవ మతానికి చెందిన మహిళను వివాహమాడిన ఆయనకి 1986లో ఒక కుమారుడు కలిగాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయితే ఆ పిల్లవాడు పుట్టినప్పడు కేవలం 750 గ్రాములు మాత్రమే ఉన్నాడు. అంతేకాదు ఆ పిల్లవానికి దృష్టిలోపం, నడవలేడని తెలుసుకున్నారు. దీనితో వారు అతడిని అనేక మంది వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఆధునిక వైద్యం అతనికున్న రుగ్మతలను తొలగించలేకపోయింది. ఈ రుగ్మతలను తొలగించమని ఆ దైవాన్ని ప్రార్థించటం మొదలుపెట్టారు.

WD PhotoWD
జనవరి 1993న రవిమాస్టర్ తన శక్తి గురించి మరింతగా ప్రార్థన చేశాడు. ఆ సమయంలో పై నుంచి ఓ మహత్తర శక్తి ఆయనలోకి ప్రవేశించింది. ఆ స్థితిలో అసలేం జరిగిందో తెలియని అయోమయ స్థితికి ఆయన లోనయ్యారు. అయితే ఓ ఆప్యాయమైన పిలుపు ఆయన అయోమయానికి తెరదించింది.

ఆ గొంతు నుంచి, "నేను బ్రహ్మదేవుడ్ని, ఈ సృష్టికి వెలుగును నేను. ఇప్పుడు నేను నీలో ప్రవేశించాను. నీ ద్వారా నేను ఎందరో అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులను చేస్తాను. నీ కుమారుని గురించి నీవేమీ చింతకు. మీ అబ్బాయి మరో నాలుగు రోజుల్లో నడవగలడు, చూడగలడు" అన్న మాటలు రవి మాస్టర్ చెవులకు వినిపించాయట.

మొదట్లో ఇదంతా ఓ కలగా భావించాడు రవి మాస్టర్. అయితే నాలుగోరోజు తన కుమారుడు అతను ముందు నడవటం చూసి నిజంగా తనను బ్రహ్మ దేవుడు ఆవహించినట్లు భావించాడు. ఆ తర్వాత తన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయటం మొదలుపెట్టారు.

తనకున్న బ్రహ్మశక్తితో క్యాన్సర్, సోరియాసిస్ వంటి రోగాలను నయం చేయగలనంటారు రవిమాస్టర్. అయితే తాను నిర్వహించే చికిత్సకు ఎలాంటి పైకం తీసుకోనని చెపుతారాయన. మానవతా విలువలను అనుసరించి తానీ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెపుతారాయన. ఇప్పటివరకూ ఆయన నిర్వహించిన ఉచిత వైద్యంలో దాదాపు 8 లక్షలమంది రోగులు తమ రోగాల బారినుంచి బయటపడినట్లు అంచనా.

బ్రహ్మ తీర్థంతో వ్యాధి నయం....
రవి మాస్టర్ పవిత్రమైనటువంటి ఔషధంగా బ్రహ్మతీర్థాన్ని ఇస్తారు. దీనిని ఏడాదికోసారి ఇస్తారు. దీనిని పంచేది ఏ రోజన్న విషయాన్ని ముందుగా తెలియజేస్తారాయన. నవగ్రహాల శక్తులు రవిమాస్టర్ శరీరంపై పడి ఆ తర్వాత అవి నీటిలో మమేకమవుతాయి. అందువలన ఈ నీటిని బ్రహ్మతీర్థంగా వ్యవహరిస్తున్నారు.

ఈ పవిత్ర జలాన్ని ఎవరైతే సేవిస్తారో వారు పరిశుద్ధలవుతారు. అంతేకాదు ఎలాంటి అనారోగ్యాలైనా పటాపంచలై స్వస్థత పొందుతారు. ఇంకా బ్రహ్మగురు ఇల ా
WD PhotoWD
చెపుతారు... మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరి నేరుగా స్వర్గానికి వెళ్లాలంటే ఈ తీర్థం తాగితే చాలు అంటున్నారు. వారు బంధువులు ఎటువంటి వారికి ఎటువంటి కర్మలు చేయనవసరం లేదంటున్నారాయన. తన స్పర్శతో మొండి వ్యాధులను సైతం నయం చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆధునిక శాస్త్రంలో ఇలాంటి పద్ధతులకు చోటేలేదు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయితే నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయటానికి ఖచ్చితమైనటువంటి పద్ధతులు నేటికీ అందుబాటులో లేకపోయినప్పటికీ రవి మాస్టర్ స్పర్శా చికిత్స ఎందరో రోగులకు స్వస్తత చేకూర్చుతోంది. కొందరైతే దీనిని ప్రత్యామ్నాయ వైద్యవిధానమంటున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి. ఆ తీర్థాన్ని తాగినా, ఆ చేతి స్పర్శను చూసినా వ్యాధి ఇట్టే నయమవుతుందని మీరూ భావిస్తున్నారా? అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Salary Cut : జగన్మోహన్ రెడ్డి జీతంలో కోత లేదా సస్పెన్షన్ తప్పదా?

Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రారంభించిన తీన్మార్ మల్లన్న

ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

ఫేక్ ప్రచారం.. వైకాపా నేత భూమనకు పోలీసుల నోటీసు

శబరిమల అభివృద్ధికి రూ.70.37 కోట్లు ఖర్చు చేశాం-వాసవన్ ప్రకటన

14-09-2025 ఆదివారం దినఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం

Weekly Horoscope: 14-09-2025 నుంచి 20-09-2025 వరకు ఫలితాలు

Shardiya Navratri 2025: దసరా నవరాత్రులు.. ఈసారి పది రోజులు.. ఐరావతంపై వస్తున్న దుర్గమ్మ..

Daily Astrology: 13-09-2025 రాశి ఫలాలు.. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి..

Kalki: కల్కికి కలి శత్రువు: కలి బాధలు తొలగిపోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి

Show comments