Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణుడిని పూజించే గ్రామం

Webdunia
ఏది నిజం సీరీస్‌లో భాగంగా ఈ వారం మిమ్మల్ని రావణుడిని పూజించే గ్రామానికి తీసుకుపోతున్నాం. ఆశ్చర్యంగా ఉందా... అవును ఆ ఊరిలో రావణుని పూజించకపోతే ఊరు మొత్తానికి అరిష్టం దాపురిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఉజ్జయిని జిల్లాలోని ఈ గ్రామం పేరు చిక్కాలి.

సాంప్రదాయం ప్రకారం ప్రతి చైత్ర నవరాత్రులలో దశమి నాడు ఈ గ్రామస్తులు రావణుడిని పూజిస్తుంటారు. ఈ సమయంలో రావణుడి గౌరవార్థం ఒక జాతర కూడా చేస్తారు. ఆ రోజు ఊరి ప్రజలంతా రామ రావణ యుద్ధంపై నాటకం కూడా వేస్తారు. ఈ జాతర ఎంత పేరు పొందిందంటే, ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తుంటారు.

ఈ ఆలయ పూజారి బాబూభాయ్ రావణ్. రావణుడికి సమర్పించే పూజలన్నింటిని ఈయన నిర్వహిస్తుంటారు కాబట్టి తన పేరు కూడా బాబుభాయ్ రావణగా మారిపోయింది. తనకు రావణుడి ఆశీర్వాదం ఉందని ఆయన నమ్మకం. ఊరికేదయినా సమస్య వచ్చిందంటే ప్రజలు అతని వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు.

అప్పుడు రావణుడి విగ్రహం ముందు బాబూభాయ్ రావణ కూర్చుని ప్రజల కోరిక తీరేంతవరకు నిరాహార దీక్షలో కూర్చుంటారు. ఒకసారి ఈ గ్రామం, చుట్టుపక్కల ఊర్లు నీటి కొరతతో సతమతమయినప్పుడు బాబుబాయ్ రావణుడి విగ్రహం ముందు కూర్చుని పూజ ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా 3 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది.

ఈ ప్రాంతంలో రావణుడిని మాత్రమే కొలుస్తారని, చాలా సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోందని కైలాష్ నారాయణ వ్యాస్ అనే భక్తుడు చెప్పారు. ఒకసారి ఏదో కారణంగా ఊరి ప్రజలు చైత్ర దశమి రోజున రావణుడికి జాతర, పూజలు చేయకుండా ఉండిపోయారట. తర్వాత అగ్నిప్రమాదంలో చిక్కుకుని ఊరంతా తగలబడి పోయిందట. గ్రామస్తులు అందరూ కలిసి మంటలార్పడానికి ప్రయత్నించినా ఒకే ఒక్క ఇంటిని మంటల్లో చిక్కుకుపోకుండా కాపాడారట.

పద్మా జైన్ అనే మరో మహిళ కూడా ఈ నమ్మకాన్ని బలపరుస్తుంది. రావణుడిని చైత్ర దశమి రోజున పూజించకపోవడంతో ఆ ఊరు రెండు సార్లు తగలబడిపోయిందని చెబుతుంది. ఒకసారి రావణుడి జాతర జరుపకుండా, జాతర నిర్వహించకుండా ఊరు ఎలా మంటల్లో తగులబడుతూందో రికార్డు చేయాలని ప్రయత్నించారు కాని అదేసమయంలో పెను తుఫాను వచ్చి మొత్తాన్ని ఊడ్చేసింది.
WD


రావణుడిని పూజించడం వింతేమీ కాదు. ఎందుకంటే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో, శ్రీలంకలోను రావణుడి ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే రావణుడికి పూజలు చేయకపోతే గ్రామం తగులబడిపోయే విచిత్ర సంఘటనను మాత్రం మీరు ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు. దయచేసి మీ అభిప్రాయం మాకు రాయండి.

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

RPF Constable Carries Child: బిడ్డతో పాటు లాఠీ.. ప్లాట్‌ఫారమ్‌పై గస్తీ చేస్తోన్న మహిళా కానిస్టేబుల్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

Show comments