Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివుని కారాగారం చూద్దాం రండి

Webdunia
సోమవారం, 14 జనవరి 2008 (21:01 IST)
WD
' ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి మీకు ఓ వింతైన జైలును, దాని అధికారిని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ జైలు అధికారి ఎవరో తెలుసా... సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే. ఈ సంగతి తెలిసినవెంటనే మేము రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి బయలుదేరాం. ఈ జైలు మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాకు సమీపంలో ఉంది. అక్కడకు చేరుకున్న మాకు, జైలు కటకటాల వెనక ఉన్న ఖైదీలు కన్పించారు. అంతేకాదు చాలామంమంది ఖైదీలు బారికేడ్లలో ఉండటాన్ని చూసి మాకు ఆశ్చర్యం వేసింది.

బారికేడ్లలో ఉన్న ఒకతను తాను వ్యాధి నివారణ నిమిత్తం ఆ జైలులో చేరినట్లు మాతో అన్నాడు. వ్యాధి తొలగిపోగానే మహాశివుని అనుమతితో తన నివాస స్థలానికి తిరిగి పోతానని అతడు చెప్పాడు. ఇతనిలాగే చాలామంది అక్కడకు వచ్చినట్లు తెలుసుకున్నాం. అంతేకాదు వారంతా ‘జై పరమేశ్వరా’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. పరమశివుని భక్తి పారవశ్యంలో వాళ్ళంతా మునిగితేలుతున్నారు. అంతేకాదు దేహానికి మట్టి పులుముకున్న వాళ్ళంతా దేవాలయం ఆవరణలో జరిగే శివనాదంలో పాల్గొన్నారు.
WD


' తిలిసవ మహదేవ్' అని పిలువబడే శివలింగం అక్కడ స్వయంభుగా వెలిసినట్లు చెపుతారు. ఈ దేవాలయం సుమారు 2 వేల సంవత్సరాలనాటిదని స్థానికులు ఒకరు మాకు చెప్పారు. ఆ దేవాయ ప్రాంగణంలో ఓ చెరువు ఉంది. ఈ చెరువు గంగానది ప్రారంభ స్థానం అని స్థానికులు విశ్వాసం. ఆ సరస్సులోని మట్టికి మహామహా రోగాలను సైతం నయం చేయగల మహత్యం ఉందని అక్కడి వారు నమ్ముతారు. అయితే ఈ మట్టిని చికిత్సకువాడేవారు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఇలా చేసినవారికి పట్టిన రోగం శాశ్వతంగా దూరమవుతుంది. కారాగారవాస కాలాన్ని ఎవరైతే ముగిస్తారో వారిని ఆ పరమేశ్వరుడు పూర్తి ఆరోగ్యవంతులను చేస్తాడు.

WD
వ్యాధిని వదిలించుకోవాలనుకునే రోగి ముందస్తుగా దేవాలయ పరిపాలనా విభాగానికి ఓ వినతి పత్రం సమర్పించుకోవాలి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే వినతిపత్రం సమర్పించినవారిలో అధికులు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కావటం. వారి అభ్యర్థనను అంగీకరించిన తర్వాత, దేవాలయ పరిపాలనా విభాగం రోగికి ఓ బ్యాడ్జ్‌ను ఇస్తారు. ఇతని తిండి ఖర్చులు పరిపాలనా విభాగమే చూసుకుంటుంది.

ఖైదీకాబడ్డ సదరు రోగి ప్రతిరోజూ చెరువులో స్నానమాచరించాలి. స్నానం చేసిన తర్వాత తలపై బరువైన రాతిని పెట్టుకుని దేవాలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేయాలి. ఇక దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఖైదీలదే. ఇలా రోజులుకాదు, నెలలు కాదు... సంవత్సరాలే గడిచాయి. గడుస్తున్నాయి. కలలో మహేశ్వరుడు ప్రత్యక్షమై, ఇప్పుడు నీకు వ్యాధి నయమైంది... పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నావు అని చెప్పినప్పుడే సదరు ఖైదీ విముక్తుడవుతాడు.
WD


అంతేకాదు ఇటువంటి కల, పరిపాలనా విభాగం అధికారికి వచ్చినా సదరు ఖైదీని విడుదల చేయటానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తాడు. అంతే రోగులు ఆ జైలు నుంచి విముక్తులవుతారు. మాకు ఇదంతా ఓ అసాధారణ పద్ధతిలా అనిపించింది. దీనిని నమ్మటం చాలా కష్టమే.. మరోవైపు తమ బంధువులే వచ్చి వారివారి జబ్బులను నయం చేస్తున్నట్లు కొందరి మాట. దీనిపై మీరేమనుకుంటున్నారు... దీనిపై మీకు నమ్మకముందా.... మీ అభిప్రాయాలను మాకు రాస్తారు కదూ.....

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు - కీలక బిల్లులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు పిడుగుల గండం.. భారీ వర్ష సూచన

Salary Cut : జగన్మోహన్ రెడ్డి జీతంలో కోత లేదా సస్పెన్షన్ తప్పదా?

Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రారంభించిన తీన్మార్ మల్లన్న

ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

15-09-2025 సోమవారం ఫలితాలు - రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి....

14-09-2025 ఆదివారం దినఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం

Weekly Horoscope: 14-09-2025 నుంచి 20-09-2025 వరకు ఫలితాలు

Shardiya Navratri 2025: దసరా నవరాత్రులు.. ఈసారి పది రోజులు.. ఐరావతంపై వస్తున్న దుర్గమ్మ..

Daily Astrology: 13-09-2025 రాశి ఫలాలు.. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి..

Show comments