Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి శరీరంలో సాయినాధుని ప్రతిరూపం

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2008 (20:36 IST)
WD
ఒక వ్యక్తి శరీరంలోనికి సాయిబాబా ప్రవేశించి, అతని బాధను విచారాన్ని పారదోలతాడన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా...? ఇది కాస్తంత అసాధారణమైనదిగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది నిజం. కనుకనే ఈ వారం ఏదినిజం శీర్షికలో భాగంగా మిమ్మల్ని మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో కొలువైవున్న సాయినాధుని ఆలయానికి తీసుకవెళుతున్నాం. ఇక్కడి సాయినాధుడు ఓ మహిళ శరీరంలోనికి ప్రవేశిస్తాడట.

ఈ సాయినాధుని ఆలయంలో పూజారిణిగా పనిచేస్తున్న ఇందుమతి మరదలు ఆషా టర్కేనె శరీరంలోనికి సాయినాధుడు గత పదిహేనేళ్లుగా ప్రవేశిస్తున్నాడట. ఆమె శరీరంలోకి సాయిదేవుడు ప్రవేశించినంతనే పుట్టెడు దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తుల శరీరం నుంచి వాటిని పారదోలుతుందట. ప్రతి గురువారం సాయినాధుడు ఆమె శరీరంలోనికి ప్రవేశిస్తాడు, ఫలితంగా ఆమె గొంతు పురుషుని కంఠస్వరంలా మారిపోతుంది. అంతేకాదు ఆమె ప్రవర్తన మారుతుంది. మగరాయుడిలా సిగరెట్టు కాల్చడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత క్రమంగా ప్రతి భక్తుడు చెప్పే సమస్యలు విని వాటికి పరిష్కార మార్గాలను చూపుతుంది.

బాబాపై అత్యంత విశ్వాసం కలిగిన రఘువీర్ అనే భక్తుడు మాతో ఇలా చెప్పుకొచ్చాడు. అనేకానేక చిక్కులతో సమతమతమవుతున్నవారు ఇక్కడికి వచ్చి బాబాను సందర్శించి టర్కెనే చూపే పరిష్కారాలతో వారు హాయిగా జీవించడాన్ని తాను కళ్లారా చూశానన్నాడు. అయితే దీనంతటికీ కావలసింది ఒక్కటే... అదేమంటే బాబాపై పూర్తి భక్తి విశ్వాసాలను ప్రదర్శించటం.

ఇక్కడి ఆలయాన్ని పదేళ్లుగా సందర్శిస్తున్నానని మరో భక్తుడు చెప్పాడు. ఈ ప్రాంతాన్ని దర్శించడంతో తన మనసు ప్రశాంతతను పొందుతుందని చెప్పాడు. ఇదే అనుభూతిని ఈ ప్రదేశాన్ని సందర్శించినవారందరిలోనూ కలగడంతో, ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు రావడం మొదలైంది.
WD


సాయినాధుడు చేసిన ఘనకార్యాలను మనం నేటికీ మననం చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఆయన భోదనలు నేటికీ ఆచరిస్తూనే ఉంటారు. అయితే సాయిబాబా ఒక వ్యక్తి శరీరంలోనికి ప్రవేశిస్తాడన్న విషయాన్ని మీరు విశ్వసించగలరా...? ఇది ఆధ్యాత్మికతకు ఓ ఉదాహరణ అంటారా... లేదంటే ఇదో మూఢనమ్మకమని చెపుతారా... ఏమంటారు. దయచేసి మాకు రాయండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments