Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ తిరుగాడే దేవాలయం

Webdunia
సోమవారం, 19 మే 2008 (21:03 IST)
WD
ఏదినిజం వరుసలో భాగంగా ఓ ప్రత్యేక దేవాలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ దేవాలయం గురించి ప్రజల్లో భిన్న రకాలైన నమ్మకాలున్నాయి. కొంత మంది ఇది గొప్ప విశిష్టత కలిగిన దేవాలయంగా చెబుతుండగా, మరి కొందరు శాపగ్రస్తమైందిగా చెబుతున్నారు. ప్రార్థనల సందర్భంగా బలులను దేవత అంగీకరిస్తుందనీ కొందరంటుంటే... మరికొందరు ఈ స్థలంలో ఓ మహిళ ఆత్మ తిరుగుతోందంటున్నారు. అవును, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అభిప్రాయం. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఈ పురాతన దుర్గ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించి ఎన్నో వదంతులు షికారు చేస్తున్నాయి.

మహరాజా దేవాస్ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెపుతారు. అయితే ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఆ ప్రాంతంలో అనేక భయంకర సంఘటనలు చోటుచేసుకున్నాయి, ఈ దేవాలయానికి రూపకల్పన చేసిన రాజు కుమార్తె దేవాలయంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువరాణి మరణించిన తర్వాత ఆ వేధనను భరించలేక ఆమెను గాఢంగా ప్రేమించిన ఆ రాజ్య సేనాధిపతి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సింహ గర్జనలూ... గంటల మోతలు...
  దేవాలయం నుంచి సింహం అరుస్తున్నట్లు గర్జనలు, మరికొన్నిసార్లు దేవాలయం గంటల మోతలు వారికి వినబడుతుండేవి. కొన్నిసార్లు ఆలయం చుట్టూ ఓ మహిళ తెల్లచీరలో వెళ్లే నీడలా...      


వారిద్దరూ చనిపోయిన తర్వాత ఆ దేవాలయం కళంకితమైందిగా, అపవిత్రమైందిగా మారిందనీ, అమ్మవారి విగ్రహాన్ని ఉజ్జయినీలో వేరే ఎక్కడైనా ప్రతిష్ఠాపించాలని ఆలయ ప్రధాన పూజారి మహారాజుకు చెప్పాడు. దీనితో అమ్మవారిని ఉజ్జయినిలోని పెద్ద గణపతి దేవాలయంలో సర్వ సంస్కారాలతో ప్రతిష్ఠాపించారు. దుర్గామాత ప్రతిమను కూడా ఖాళీ స్థలంలోనే ఉంచారు. అయితే ఆ తర్వాత కూడా ఆ దేవాలయంలో విచిత్ర సంఘటనలు కొనసాగుతూ వచ్చాయ ి

WD
అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం కొంతకాలానికి దేవాలయం నుంచి విచిత్ర శబ్ధాలు విన్పిస్తుండేవని స్థానికులు చెప్పుకోవడం ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో దేవాలయం నుంచి సింహం అరుస్తున్నట్లు గర్జనలు, మరికొన్నిసార్లు దేవాలయం గంటల మోతలు వారికి వినబడుతుండేవి. కొన్నిసార్లు ఆలయం చుట్టూ ఓ మహిళ తెల్లచీరలో వెళ్లే నీడలా కన్పించిందని వారు చెబుతున్నారు. సాయంత్రమైతే చాలు... వారు భయంతో ఆ గుడివైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు.

WD
భక్తులు తమ మనసులో ఆలయం పట్ల వ్యతిరేక భావనలతో రావటం వల్లనే వారు కొన్ని సమస్యలకు గురవుతున్నారని ఆలయ భక్తులలో ఒకరైన సంజయ్ మల్గావ్‌కర్ చెప్పాడు. అంతేకాదు కొందరు ఆలయ భూమిని వేరే ఇతర ఉపయోగాలకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఆలయాన్ని ధ్వంసం చేయటానికి యత్నించారు. అయితే వారు సఫలీకృతం కాలేకపోయారు. ఎవరైతే గుడికి హాని తలపెట్టాలని ప్రయత్నించారో... వారు తమ జీవితంలో ఎన్నో భయంకర సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ గుడిలో పనిచేసే కార్మికులు గుడిలో నుంచి ఓ వెలుగు రావటాన్ని గమనించామంటున్నారు. ఇటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు రావటంతో, ఆలయ నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఎటువంటి మార్పులకు నోచుకోక శిథిలావస్తలో ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఆలయాన్ని సందర్శించి మరింత తరచి చూడాలనుకుంటే... వారు భౌతికంగా అనేక సమస్యలను ఎదుర్కోవటం ఖాయమనీ, ఇటువంటి సంఘటనలను తాను కళ్లారా చూశాననీ సంజయ్ చెపుతున్నాడు.
WD


ఈ తరహా సంఘటనలు నిజంగా జరిగేవా లేక వట్టివా అనే సంగతి ప్రక్కన పెడితే... ఈ దేవాలయానికి సంబంధించి విచిత్రంగా షికారు చేస్తున్న కథలతో ప్రజలు ఈ దేవాలయానికి కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే భక్తి, మత విశ్వాసాలతో భక్తులు ఇక్కడకు వస్తూనే ఉన్నారు. ఊహాజనిత కల్పనా భయాలు వారి మనసుల్లో వేళ్లూనుకుని ఉండడంతో సాధ్యమైనంత త్వరగానే ఆ దేవాలయ ప్రాంగణం నుంచి వారు వెళ్లిపోతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో దయచేసి మాకు తెలియజేయండి...

ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

Chandra babu: త్వరలో సంజీవని ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కారు

Amaravati: అమరావతి తొమ్మిది లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం.. తుది దశలో పనులు

Air India: విమానం రెక్కల్ని ఢీకొన్న పక్షి- 103మంది ప్రయాణీకులను కాపాడిన పైలట్

Jayalalitha: జయలలిత నెచ్చెలి శశికళ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ఓ హనుమా! నేను నీ శరణు కోరుతున్నాను

15-09-2025 సోమవారం ఫలితాలు - రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి....

14-09-2025 ఆదివారం దినఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం

Weekly Horoscope: 14-09-2025 నుంచి 20-09-2025 వరకు ఫలితాలు

Shardiya Navratri 2025: దసరా నవరాత్రులు.. ఈసారి పది రోజులు.. ఐరావతంపై వస్తున్న దుర్గమ్మ..

Show comments