Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయ్యాల బెడదను వదిలించే మురికినీటి స్నానం

Webdunia
Shruti AgarwalWD
చేతబడుల లోయగా పేరొందిన హుస్సేన్ టేక్రీలోని మురికి నీటిలో స్నానం చేయడంతో భూత, ప్రేత, పిశాచాల బెడద తొలగిపోతుందని కొందరి విశ్వాసం. దీనిని ఆచరిస్తున్న వారిని మేము కళ్లారా చూశాం. ఆ ప్రాంతానికి మేము ఉదయం 7.00 గంటలకు చేరుకున్నాము. ప్రవేశ ద్వారం వద్ద అసహజ స్థితిలో ఉన్న ఇద్దరు స్త్రీలను మేము చూశాం.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జమునా బాయి మరియు కౌసర్బీగా పిలవబడే ఆ ఇద్దరు స్త్రీలు మా ముందు “అరె బాబా రే...” అంటూ అరవడం ప్రారంభించారు. జమున భర్త మాతో మాట్లాడుతూ “ గత కొద్ది రోజులుగా జమున ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. మతిభ్రమించి పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నది. ఆమెకు దయ్యం ఆవహించినందున ఇక్కడకు రావలసిందిగా ఒక పూజారి మాకు సలహా ఇచ్చారు.”

ఇంకా ఆయన తన సంభాషణను కొనసాగిస్తూ “ ఆమెకు స్వస్థత చేకూర్చే నిమిత్తం రెండు వారాల క్రితం మేమిక్కడికి వచ్చాము. మొదటిరోజు చికిత్స నుంచి ఆమె ఏడవడం ప్రారంభించింది. ఐదు “జుమ్మాస ్ ” అనంతరం ఆమె మామూలు మనిషి అవుతుందని ఆశిస్తున్నాము.”
Shruti AgarwalWD


తరువాత మేము హజ్రత్ ఇమామ్ యొక్క “రోజ ా ” ( ముస్లింలు పవిత్రంగా భావించే సమాధులు లేని ప్రాంతం) లోనికి ప్రవేశించాము. అక్కడి వాతావరణం మమ్మల్ని విభ్రాంతికి గురి చేసింది. దృఢమైన గొలుసులతో కట్టివేయబడిన స్త్రీ, పురుషులు అక్కడ పెద్దగా రోదిస్తూ కేకలు వేస్తూ కనిపించారు. అక్కడి వాతావరణం భీభత్సంగా ఉంది.

మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి

Shruti AgarwalWD
హజ్రత్ ఇమామ్ తైమురి మాతో మాట్లాడుతూ “ ఈ నీటిలో స్నానం రోగులకు స్వస్థత చేకూరుస్తుంది. అప్పుడు అతను ఒక ముడిని వలలోకి మరొక ముడిని ఆమె లేదా అతని మెడకు వేస్తాడు. ముడి వేసిన అనంతరం రోగి దయ్యం ప్రభావానికి లోనై అసాధారణంగా ప్రవర్తిస్తాడని చెప్పబడి ఉంది. తరువాత ఈ ప్రాంగణంలోని కొలనులో స్నానమాచరించేందుకు రోగి పంపబడతాడు.”
ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మురికి నీటి కొలను వద్ద జుగుప్సాకరమైన వాతావరణం మా కంటబడింది. పైపు-లైనుల ద్వారా నగరం నుంచి వచ్చిన చెత్తాచెదారం నీటిలో పడుతుండగా రోగులు అందులో స్నానం చేస్తూ కనిపించారు. సకీనా అనే అమ్మాయి మాతో మాట్లాడుతూ “ మా అమ్మకు దయ్యం పూనింది, ఆ దయ్యం నన్ను ఆవహించకూడదని ముందు జాగ్రత్తగా కొలనులో స్నానం చేస్తున్నాను.”

మరికొద్ది సేపటికి “రోజ ా ”లో హాని కలిగించుకునే సమయం ఆసన్నమైనదంటూ ఒక ప్రకటన మాకు వినిపించింది. “లోబాన ్ ”లో పాల్గొన్న రోగులు అసాధారణ కార్యకలాపాలు సాగిస్తున్నారు. మరో పూజారి నవాబ్ సర్వర్ అలీ మా సందేహాలను నివృత్తి చేయడానికన్నట్లు మురికి నీటి స్నానం ఆరోగ్యవంతులకు హానీ కలిగించదు. ఈ ప్రక్రియలో కేవలం దుష్ట ఆత్మలు మాత్రమే బాధింపబడుతాయని అన్నారు.
Shruti AgarwalWD


ఆ రోజంతా మేమక్కడే గడిపాం. ఈ ప్రాంతం పట్ల తమకు గల విశ్వాసాన్ని అనేక మంది మాతో పంచుకున్నారు. వారిలో ఒకరైన పవన్ మాతో మాట్లాడుతూ “మాకు ఈ స్థితిని బాబా సాహీబ్ ప్రసాదించారు. మేము వారికి ఎంతగానో కృతజ్ఞులమై ఉంటాము. బాధలలో ఉన్న మా బిడ్డకు వారి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాము.”

మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి

Shruti AgarwalWD
అక్కడున్న వారిలో 80 శాతం మంది వెనుకబడిన మరియు నిరక్షరాస్యులైన మహిళలు ఉన్నట్లు గుర్తించాము. బాబా సాహెబ్ సన్నిధిలో తాను ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నట్లు గత కొద్ది మాసాలుగా ఇక్కడే ఉంటున్న అమెరికాలో స్థిరపడిన విద్యార్థి ఇమ్రాన్ తెలిపాడు.

Shruti AgarwalWD
మానసిక విశ్లేషకులు డాక్టర్ రమణి అధ్యయనం ప్రకారం “ ఈ ప్రక్రియ మేము మనోవైకల్యముగా నిర్దారించాము. ఈ వ్యాధి కారణంగా రోగి మతిభ్రమించినవారిలా ప్రవర్తిస్తాడు. అలాగే సైడోసిరాస్గా పిలవబడే మరో వ్యాధికి గురైన రోగి పూర్తిగా మౌనం వహిస్తాడు. ఈ వ్యాధులు చాలా సులభంగా నయమవుతాయి. వ్యాధినివారణ పట్ల దిగువ తరగతి వర్గాలకు సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.” అన్నారు.
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ విశ్వాసానికి శ్రీకారం :
జావ్రా నవాబైన నవాబ్ ఇస్మాయిల్ అలీ ఖాన్ పాలనలో ఒకే రోజున వచ్చే దసరా మరియు మొహర్రం పండుగల కారణంగా హిందు, ముస్లిం ప్రజల మధ్య గొడవలు జరుగుతుండేవి. దసరా ఉత్సవాలలో పాల్గొనాలని నవాబ్ నిర్ణయించడం ముస్లింలకు ఆగ్రహం కలిగించింది. దాంతో మొహర్రం సందర్భంగా గుమికూడేందుకు వారు నిరాకరించారు.

మొహర్రం ముగిసిన మరునాడు ఆ ప్రాంతలో వజ్రాన్ని కనుగొన్న ఒక మహిళ ఆ ప్రాంతంలో ఆత్మలు దుఃఖిస్తున్నాయని నవాబ్కు తెలిపింది. తన తప్పును తెలుసుకున్న నవాబు సంతాపం ప్రకటించేందుకు జన సమూహాన్ని తిరిగి సేకరించవలసిందిగా ఆదేశించాడు. ఆ నాటినుంచి, ఈ ప్రాంతం పలు సమస్యలను నివారించే ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరుగాంచింది.
Shruti AgarwalWD


కర్బాలాలో వెలసిన 'రోజా'
హజ్రత్ హిమామ్ హుస్సేన్ యొక్క పవిత్ర ‘రోజ ా ’ (సమాధి) ఇరాక్లోని కర్బాలాలో కొలువై ఉంది. వారి సోదరుడు హజ్రత్ ఇమామ్ హసన్ ఇరాక్లోని కుఫ్ఫా నగరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యప్రదేశ్లోని జోవ్రాలో గల టేక్రీలోని రోజాలో హుస్సేన్ యొక్క ప్రాతినిధ్యాన్ని ఆయన అనుయాయులు విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాలను అనుసరించి ఇక్కడి రోజా దర్శనం, ఇరాక్లోని హుస్సేన్ రోజా దర్శనం తాలూకూ ప్రభావాన్ని చేకూరుస్తుంది. అందువల్లనే ఇరాక్లోని రోజా నమూనాను ఇక్కడ ప్రతిష్ఠించి అదే పేరును పెట్టారు.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments