Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధునిక యుగంలో 'నిప్పుల యుద్ధం'

Webdunia
సోమవారం, 12 నవంబరు 2007 (20:46 IST)
WD
గగుర్పాటు కలిగించే గౌతమ్‌పురా సంప్రదాయ హింగోట్ యుద్ధం దివ్యకాంతుల దీపావళి పండుగను బాణసంచా ధ్వనులతో ఆనందించిన మీకు, గగుర్పాటు కలిగిస్తూ దీపావళి ఉత్సవాన్ని జరుపుకునే ఒకానొక సంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నాము. యుద్ధంతో పాటు దీపావళికి చెందిన అన్ని రకాల అంశాలను భీతి కొలిపే ఈ ఉత్సవం కలిగి ఉంటుంది. గౌతమ్‌పురాలో జరిగే 'హింగోట్' యుద్ధం గురించి మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గల ఇండోర్ నగరానికి 55 కి.మీ.ల దూరంలో గౌతమ్‌పురా గ్రామం ఉన్నది.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

' హింగోట్' సంప్రదాయ క్రీడను యుద్ధ రూపంలో గౌతమ్‌పురా ప్రజలు జరుపుకుంటారు. ఈ క్రీడలో అనేకమంది గాయపడినప్పటికీ, క్రీడ పట్ల వారికి గల అభిమానం ఏ మాత్రం తరిగిపోలేదు. అడవిలోని పొదలలో పండే హింగోట్ పండ్లను ఆటకు నెలరోజుల ముందు నుంచే గ్రామీణులు సేకరించడం ప్రారంభిస్తారు. అనంతరం బోలుగా ఉండే పండ్లను మందుగుండు సామానుతో నింపుతారు. దట్టించిన పండ్లను వెదురు బద్దకు దారం, బంకమట్టితో కడతారు. దీపావళి పండుగ రెండవరోజున జరిగే అత్యంత ప్రసిద్ధి చెందిన 'హింగోట్' యుద్ధాన్ని అనుభవించేందుకు గ్రామంలోని ఆబాలగోపాలం ఎదురు చూస్తుంటారు. కళంగ, టుర్ర అనబడే రెండు సమూహాలుగా యుద్ధంలో పాల్గొనే ఆటగాళ్ళు విడిపోతారు.
WD


యుద్ధాన్ని పోలిన ఈ క్రీడలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు 'హింగోట్‌లు' విసురుకుంటారు. ఈ ప్రమాదకరమైన క్రీడలో ప్రతి యేటా 40 నుంచి 50 మంది ప్రజలు గాయాలపాలవుతుంటారు. అయినప్పటికీ ఈ క్రీడ పట్ల ప్రజలలో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతున్నదే కానీ తరగడంలేదు. అంతేకాక వృత్తివ్యాపకాల నిమిత్తం ఇతర ప్రాంతాలలో నివసించే గ్రామీణులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా విచ్చేస్తుంటారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

WD
ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియనప్పటికీ, దీపావళి మరునాడు జరిగే యుద్ధక్రీడోత్సవాన్ని జరుపుకునేందుకు వేలసంఖ్యలో ప్రజలు గుమికూడుతారు. భయానకమైన సంప్రదాయ క్రీడను ప్రారంభించే ముందు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. హింగోట్లను చేబూని ఆటగాళ్ళు ఈ క్రీడలో పాల్గొంటారు. చివరి హింగోట్ విసిరేంతవరకు కూడా యుద్ధ క్రీడ కొనసాగుతూనే ఉంటుంది.

ఫోటోగ్యాలెరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

తనకు 20 సంవత్సరాల వయస్సు వచ్చిన నాటి నుంచి హింగోట్ యుద్ధంలో పాల్గొంటున్న కైలాష్, ఈ యుద్ధం గ్రామ సంప్రదాయ క్రీడగా మాతో అన్నాడు. అనేక సార్లు గాయాలపాలైనప్పటికీ, ఈ యుద్ధ క్రీడలో పాల్గొనడాన్ని కైలాష్ మానుకోలేదు. ఇక రాజేంద్ర కుమార్ అయితే నెలరోజులుగా హింగోట్ల తయారీలో తలమునకలై ఉన్నాడు. హింగోట్ల కారణంగా గత సంవత్సరం ముఖంపై ఏడు కుట్లు పడినప్పటికీ, ఈ సంవత్సరం కూడా క్రీడలో పాల్గొనేందుకు అతడు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

క్రీడతో పాటు హింగోట్ల తయారీ కూడా అత్యంత ప్రమాదకరమైంది. అనుభవం లేని వారు బోలుగా ఉండే హింగోట్ పండులోకి మందుగుండును దట్టించే పనిలోకి దిగితే ప్రమాదాల బారిన పడక తప్పదు. అంతేకాక ఆటకు ముందు ఆటగాళ్ళు పూటుగా మద్యాన్ని సేవిస్తుంటారు. యుద్ధ క్రీడలో అపశృతులు దొర్లకుండా పోలీసు దళాలు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు ఇక్కడ మోహరిస్తాయి.
WD


హింగోట్ యుద్ధ క్రీడను ఉత్సవంగా భావించి నూతన వస్త్రాలను ధరించి గ్రామీణులు పాల్గొంటూ ఉంటారు, కానీ కొన్ని సార్లు ఈ ఆనందం, వారికి విషాదంగా పరిణమిస్తూ ఉంటుంది. మరి ఈ సంప్రదాయం పట్ల మీ వైఖరి ఏమిటి?

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments