Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యకిరణాలు ఆ 3 రోజులు స్వామివారి పాదాలు, నాభి, శిరస్సును తాకుతాయ్.. ఎక్కడో తెలుసా?

టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఏపీలోని చిత్తూరు జిల్లా, నాగలాపురంలో నెలకొని వుంది. ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి సూర్య పూజ మహోత్స

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (14:48 IST)
టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఏపీలోని చిత్తూరు జిల్లా, నాగలాపురంలో నెలకొని వుంది. ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి సూర్య పూజ మహోత్సవాలు అట్టహాసంగా జరుగనున్నాయి.

ప్రతి ఏడాది మార్చిలో జరిగే ఉత్సవాలకు ప్రత్యేకత వుంది. అలాగే ఐదు రోజుల పాటు స్థానిక పుష్కరిణిలో తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మార్చి నెలలో జరిగే సూర్య పూజ మహోత్సవాల్లో తొలిరోజు సూర్యకిరణాలు రాజగోపురం నుంచి నేరుగా గర్భాలయం లోపలికి వచ్చి స్వామివారి పాదాలను తాకుతాయి. 
 
అలాగే రెండో రోజు నాభిని, మూడోవ రోజును శిరస్సును సూర్యకిరణాలు తాకుతాయి. ఈ అద్భుత సుందర దృశ్యాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు స్వామి వారి ఆలయాని తరలివస్తారు. ఇక తెప్పోత్సవాల్లో తొలి రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వేధనారాయణుడు, రెండవరోజు గోదాదేవి సమేత వేదనారాయుణుడు, మూడవరోజు సీతాలక్ష్మీ సమేత కోదండరామస్వామి, నాల్గవ-ఐదవ రోజుల్లో శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణుడి అలంకరణలో స్వామివారు దేవేరులతో ఆసీనులై తెప్పలపై విహరిస్తారు.
 
మార్చి 27వ తేదీ తెప్పోత్సవం అనంతరం స్వామివారిని, అమ్మవారిని ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిస్తారు. ఇక 28వతేదీన పెద్దశేష వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సూర్యపూజ మహోత్సవాలకు సంబంధించి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
ఇకపోతే ఈ ఆలయం పల్లవుల కాలంలో నిర్మితమైంది. ఈ ఆలయంలో సొరంగాలున్నాయని.. వాటి రహస్యాలను చేధించేందుకు టీటీడీ, పురావస్తు శాఖ సొరంగాల్లో తవ్వకాలను చేపట్టింది. ఈ తవ్వకాల్లో 14 పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. రెండో సొరంగంలో నిధుల కోసం అన్వేషిస్తూ తవ్వకాలు మొదలెట్టారు. వీటిలో విలువైన సంపద ఉంటుందని భావిస్తున్నారు. 2006లో ఒక సొరంగంలో తవ్వకాలు జరిపారు. రెండో సొరంగంలో తాజాగా తవ్వకాలు జరుగుతున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం