Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలశ పూజ ఎందుకు చేస్తారు...?!

రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి మంత్రపూర్వకంగా భగవదారాధన చేసి నిలిపిన దేవతామూర్తి కలవము. దక్షిణగా దానిలో నవరత్నములు వే

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (13:01 IST)
రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి మంత్రపూర్వకంగా భగవదారాధన చేసి నిలిపిన దేవతామూర్తి కలవము. దక్షిణగా దానిలో నవరత్నములు వేయు సాంప్రదాయమున్నా నేడు చిల్లర నాణేలను ఉంచటం ఆచారముగా మిగిలినది. దీనిని పూర్ణకులవగాను, పూర్ణకుంభముగాను వ్యవహరిస్తున్నారు. భగవదారాధన చేసి దేవతా స్వరూపముగా శుభ సూచికంగా భావించు ఈ కలశమునకు హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉన్నది.
 
హిందువుల గృహాన సకల శుభకార్యాలకూ అనగా గృహప్రవేశ ఉపనయన వివాహ గృహప్రవేశ, ఉపనయన వివాహ గృహారంభములకు ఈ కలశ స్థాసన ప్రారంభ సూచకముగా దోషములూ అవాంతరములూ కలుగకుండా నిరోధించు దైవశక్తిగా భావింతురు. ఈ పూర్ణ కుంభమును పెద్దలు పీఠాధిపతులు పూజనీయులకు స్వాగతము పలుకుటకునూ ప్రధానముగా శాస్త్రమున చెప్పబడినది. ఈ కలశ పూజ ఎందుకు చెయ్యాలంటే సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది. దాని మీద కూర్చుని ఉన్న బ్రహ్మ గోచరించెను. అంతా జలమయమై ఉన్న విశ్వములో బ్రహ్మ సృష్టి ప్రారంభించెను. ఈ సృష్టికి పూర్వ మంతయూ జలమయము. ఆ జలమండలం నుండే సృష్టి ప్రారంభమైంది.
 
నీటిని పవిత్రమైనదని సృష్టికి మూలమైనదిగా భావించి దీనికి ప్రాధాన్యతనిస్తున్నట్ల పురాణాలు చెబుతున్నాయి. సమస్త జీవులకు ఆధారమైనది నీరని మనకందరికీ తెలుసు. అంత పూజనీయమైనదని ముఖ్యమైనదనీ, ప్రధానమైనదని అనుసంకేతము నిచ్చునటుల కలశములో ఉదకము పోయుట సాంప్రదాయమైనది. దానిపై ఉంచిన కొబ్బరికాయ, ఆకులు పరిపూర్ణత్వమునకు సంకేతం దాని చుట్టూ చుట్టిన దారం ప్రేమానురాగాల బంధమునకు సంకేతము.
 
కలశమునకు పూసిన పుసుపు, కుంకుమలు సౌభాగ్యమునకు సంకేతము ఇంత అంతరార్థమున్న కలశము అన్ని శుభములకూ ఆదియూ, మంగళకరము అను భావనను కలశస్థాపన పూజ ముందు చెయ్యాలి. ఈ కలశములోని నీరు సమస్థ పుణ్య నుల నుంచి వచ్చినదనీ సమస్త పేద, మంత్రముల సారమని సకల దేవతలూ అందులో చేరి ఉన్నారన్న భావనతో మంత్రపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారట.
 
ఈ కలశమును పూజించుట వివ్వములో సకల దేవతామూర్తులను పూజించుటయే అను భావం కలుగును. ఇంత పవిత్రమైన జలము సకల అభిషేకములకూ దైవకార్యములకూ వాడదగినదని భావం. ఈ మహాభిషేకమూ కుంభాభిషేకమూ సకల దేవతలకూ ప్రీతిపాత్రమైనదని హిందువుల విశ్వాసం. క్షీరసాగర మధనం జరిగినప్పుడు పరమాత్మ ఒక కలశముతో ఉద్భవించి అందులోని అమృతమును దేవతలకు పంచెను. దాని వల్ల వారు మరణమూ వార్థక్యమూ నాశనములేని వారని హిందువుల నమ్మకం. ఈ జలం అనంతమైనదని అని హిందువుల విశ్వాసం. ఇలా పుణ్యజలముతోను, పూర్ణత్వమునకు సంకేతము కొబ్బరికాయ, పవిత్రతకు సంకేతమైన మామిడాకులు శౌభాగ్య చిహ్నములు, పసుపు కుంకుమ వేదమంత్ర మిళితమైన ఈ కలశము పూజనీయ పవిత్రము.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

తర్వాతి కథనం
Show comments