Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం ముట్టకుండా ఆలయాలకు ఎందుకెళ్లాలి.. సాత్విక ఆహారం అంటే ఏమిటి?

మాంసాహారం ముట్టకుండా ఆలయాలను దర్శించుకోవాలని పెద్దలంటారు. మాంసాహారం ముట్టని రోజు ఆలయాలను దర్శించాలని చెప్తుంటారు. మాంసాహారం తీసుకుని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయట. మాంసాహారం కామ వికార కోరికలను

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (09:25 IST)
మాంసాహారం ముట్టకుండా ఆలయాలను దర్శించుకోవాలని పెద్దలంటారు. మాంసాహారం ముట్టని రోజు ఆలయాలను దర్శించాలని చెప్తుంటారు. మాంసాహారం తీసుకుని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయట. మాంసాహారం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే.. సత్వ గుణం తగ్గిపోతుందని రజో గుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
సాత్విక గుణాలతో ఆలయాలను దర్శించుకోవడం, దైవారాధన చేయడం ఉత్తమం. మాంసాహారం ద్వారా తీసుకుంటే ఏర్పడే రజోగుణ, తమోగుణాల ప్రభావం వల్ల మనో నిగ్రహం కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా దైవారాధన సఫలం కాదని పెద్దలంటారు. అందుకే మాంసాహారం కంటే.. సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. 
 
కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారం తీసుకుని వెళ్ళొచ్చు. కొన్ని అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాంసాహారం ఓకే. అలాగే పూరీ జగన్నాథ ఆలయంలోనే మాంసాహారం కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే జగన్నాథుడి భార్య విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాపూజలు చేసి.. అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అలాగే గుడి కొలనులోని చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ. అయితే ఆంజనేయుడు, విష్ణుమూర్తి, శివాలయాల్లో మాంసాహారం నిషిద్ధం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments