Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజలు ఎలాంటి సమయాల్లో చేయాలి?

Webdunia
సోమవారం, 10 నవంబరు 2014 (14:50 IST)
దేవతారాధన పూజలకు నిర్దుష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు. 


 
చివరకు "యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్" అన్నట్లు ఏ పని చేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా. ప్రారంభంలో ఈ  జపం మూల కూర్చుని, మాలపట్టుకుని జపం చేస్తూచేస్తూ చివరకు మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానినే "అజపాజపస్థితి" అని పిలుస్తారు.
 
అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని అహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి, పరమాత్మకు సమర్పించడం. పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments