Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయిస్తే ఏం జరుగుతుంది?

దేవుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయిస్తే ఏం జరుగుతుంది?
, బుధవారం, 9 అక్టోబరు 2019 (20:39 IST)
అభిషేకాలను భగవంతునికి చేస్తాం. ఈ అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఆలయాల్లో జరిగే అభిషేకాల ద్వారా లభించే ఫలితాలేమిటో చూద్దాం.
 
కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది. 
మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది. 
స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి. 
పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు  లభిస్తాయి. 
 
కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు. 
నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. 
ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. 
ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది. 
 
పంచదారలో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు. 
విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది 
శంఖువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు.  
చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
 
చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది 
పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది. 
చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. 
తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. 
 
అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. 
అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి. 
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది. 
నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది. 
 
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి? 
వినాయకుడు - ఆదివారం
పరమేశ్వరుడు - సోమవారం 
సుబ్రహ్మణ్య స్వామి - మంగళవారం 
విష్ణుమూర్తి - బుధవారం  
గురు భగవానుడు. సాయి నాథునికి - గురువారం 
అమ్మవారికి - శుక్రవారం 
శ్రీ కృష్ణుడికి - శనివారం 
నవగ్రహాలకు - ఆదివారం 
దుర్గాదేవికి - మంగళవారం అభిషేకాలు చేయించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-10-2019- బుధవారం మీ రాశి ఫలితాలు...