Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబరు 29 నుంచి శరన్నవరాత్రులు: దుర్గాదేవి పూజకు ఏమేమి సిద్ధం చేసుకోవాలి?

సెప్టెంబరు 29 నుంచి శరన్నవరాత్రులు: దుర్గాదేవి పూజకు ఏమేమి సిద్ధం చేసుకోవాలి?
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (20:50 IST)
శరన్నవరాత్రులు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 7 వరకూ జరుగనున్నాయి. దుర్గాదేవిని ఈ 9 రోజులు నిష్టతో పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయి. దుర్గాపూజను ఎలా చేయాలో చూద్దాం.
 
నిత్యపూజలు చేసేవారైనప్పటికీ ముఖ్యమైన పర్వదినాలు, వ్రతాలు శుభకార్యాలు జరిగేటప్పుడు ఏదో తెలియని హడావుడితో కొన్ని వస్తువులు మర్చిపోతూ, వాటికి అప్పుడప్పుడు మధ్యలో లేచి వెళుతూ ఉంటారు. కొన్ని తెలియకకూడా పోవచ్చు. అందువల్ల ఈ క్రింది వస్తువులను ముందుగానే అమర్చుకుంటే మనం చేసే కార్యక్రమం మీద మనస్సు లగ్నం చేసుకున్నవారమవుతాము.
 
* పూజవేళ ఉపయోగించుటకుగాను విడివిడిగా పాత్రలలో జలము, ఉద్ధరిణెలు లేదా చెంచాలు కావాలి
* ఏ దైవమును పూజించుచున్నామో ఆ దైవము యొక్క చిత్ర పటము లేదా ప్రతిమ, అదికూడా లేనప్పుడు బంగారు లేదా వెండితో చేసిన కాసు.
* ముఖ్యముగా వినాయక, వరలక్ష్మీ పూజకు పాలవెల్లి కట్టితీరాలి
* దీపారాధనకు కుందులు, ప్రత్తితో చేసిన వత్తులు, ఆవు నెయ్యి, అవి వెలిగించుటకు ఒక అగ్గిపెట్టె, ధూపారాధనకు సాంబ్రాణి.
* పూజ నిమిత్తము అక్షతలు, పువ్వులు, పసుపు, కుంకుమ
* ఇతరేతరోపచారార్ధము- తమలపాకులు, వక్కలు, అగరువత్తులు, గంధము, హారతి కర్పూరము, కొబ్బరికాయలు.
* ప్రధానముగా కలశము, దానిపై ఒక కొబ్బరికాయ, రవికెల గుడ్డ
* నివేదన(నైవేద్యం), నిమిత్తము బెల్లము ముక్క(గుడశకలం), అరటిపళ్లు(కదళీఫలం), కొబ్బరికాయ(నారికేళఫలం) ఇవి సాధారణావసరములు.
* ఇంకను ప్రత్యేకించి వడపప్పు(ముద్గసూపం), కడుప( ఉండ్రములు), గుడపిష్టం(బెల్లం చలిమిడి), శర్కరపిష్టం( పంచదార చలిమిడి), పానకము( బెల్లపుదైన గుడపానీయం- పంచదారదైనా శర్కర పానీయం ఏదైనా తియ్యగానే ఉంటుంది కనుక మధురపానీయం)
* సూర్యుడికి పాయసమే నైవేద్యం, వినాయకుడికి రకరకాల కుడుములు స్త్రీ దేవతారాధనలో చలిమిడి, పానకం ప్రత్యేకంగా నివేదించాలి.
* ఇవిగాక భక్తులు యధాశక్తి- సూపాపూపధేను దుగ్ధ సద్యోఘృతాదులతో భక్ష్య భోజ్య లేహ్య చోప్య పానీయాదికాలతో మహానైవేద్యాలను సమర్పించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య: అన్నదానం తప్పక చేయాలట.. కర్ణుడు అలా చేయడంతోనే?