వైసిపి రాష్ట్ర నేత , మాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవి సగటు పౌరుని వలే క్యూలైన్ ద్వారా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తన నిరాడంబరతను చాటుకున్నారు. నగర వైసిపి నేతలు, యలమంచిలి యూత్ అభిమానులతో కలిసి దుర్గామల్లేశ్వర స్వామి చేరుకున్న ఆయన విఐపి దర్శనాన్ని నిరాకరిస్తూ సాధారణ భక్తులతో కలసి క్యూలైన్ అధారంగా అమ్మవారి ఆశీర్వచనం పొందారు.
వార్డు స్దాయి నేతలు సైతం ప్రోటోకాల్ దర్శనాలను కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు భిన్నంగా యలమంచిలి రవి వ్యవహరించటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా యలమంచిలి మాట్లాడుతూ భక్తులు ఏర్పాట్ల పరంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇది శుభపరిణామమని అన్నారు.
విఐపి దర్శనాల వల్ల సగటు భక్తులు ఇబ్బంది పడరాదన్న భావనతో తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశకత్వంలో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసిందని, పూర్వపు ప్రభుత్వాల కంటే మెరుగైన సౌకర్యాలు భక్తులకు అందుతున్నాయన్న విషయాన్ని తాను స్వయంగా చూడగలిగానని యలమంచిలి తెలిపారు.