Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పులిచింతల ప్రాజెక్ట్ వద్ద 45 అడుగుల వైఎస్సార్ విగ్రహం-అనిల్ కుమార్

Advertiesment
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద 45 అడుగుల వైఎస్సార్ విగ్రహం-అనిల్ కుమార్
, సోమవారం, 7 అక్టోబరు 2019 (11:47 IST)
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ ఆర్‌ 45 అడుగుల విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు మంత్రి అనిల్‌కుమార్‌. ఆయనతో పాటు పేర్ని నాని, ప్రభుత్వ విప్‌ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్‌మోహనరావు వున్నారు.

ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతు.. త్వరలోనే వైయస్‌ఆర్‌ స్మృతి వనం, పార్కుఏర్పాటు చేస్తామన్నారు. 45 అడుగుల వైయస్‌‌ఆర్‌ విగ్రహంతో పాటు, డా।।కెయల్‌ రావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని, 
 
పులిచింతల ప్రాజెక్ట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, భవనాలతోపాటు, నాలుగు కిలోమీటర్ల దిగువన గుంటూరు, కృష్ణాలను కలుపుతూ వారధి ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. 
 
సీఎం జగన్‌గారి ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ వద్ద స్థల పరిశీలన చేశామని, అనిల్‌కుమార్‌ ప్రాజెక్ట్ కట్టిన తరువాత మొట్టమొదటిగా పూర్తిస్తాయిలో నీటి నిల్వ చేయడం శుభపరిణామమని చెప్పారు. మరో ఇరవైఏళ్ళ పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలో వుంటుంది. ఇంకా జగన్‌ ముఖ్యమంత్రిగా వుంటారని మంత్రి అనిల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు.. సీఎం కేసీఆర్