Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రసెల్స్ పీనింగ్ బాయ్... నీటి వృథాకు అడ్డుకట్ట

Advertiesment
బ్రసెల్స్ పీనింగ్ బాయ్... నీటి వృథాకు అడ్డుకట్ట
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:26 IST)
బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కళాఖండాల్లో మాన్నెకెన్-పిస్ (మూత్ర విసర్జన చేసే బాలుడి కాంస్య విగ్రహం) ఒకటి. 400 ఏళ్లనాటి ఈ విగ్రహం నుంచి రోజుకు 2.5 టన్నుల నీరు వృథాగా డ్రైనేజీలో కలిసిపోతోంది. బెల్జియంలో రోజుకు ఐదు కుటుంబాలు ఉపయోగించుకునే నీటితో ఇది సమానం. ఆ విగ్రహంలో అమర్చిన పైపుల్లో లోపం తలెత్తడం వల్లే నీరు వృథాగా పోతోంది. 
 
ఆ లోపాన్ని బ్రస్సెల్స్ అధికారులు ఇటీవలే గుర్తించారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇకపై ఆ నీటిని రీసైకిల్ చేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా వృథాను అరికట్టనున్నట్టు నగర ఇంజినీర్ రెగిస్ కల్లెన్స్ తెలిపారు. 1619లో పోతపోసిన ఈ విగ్రహం చోరీకి గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి. దీంతో చాలా కాలం క్రితమే అసలు విగ్రహాన్ని మ్యూజియంలో భద్రపరిచి పర్యాటకుల కోసం నకలు విగ్రహాన్ని అదే చోట ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం చేసిన అభ్యర్థి... ప్లీజ్.. నాకే ఓటు వేయాలంటూ విన్నపం