Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుల రోజు నాడు ఆ పని చేశారు... రూ. 5 కోట్లు వచ్చాయి...

Advertiesment
ప్రేమికుల రోజు నాడు ఆ పని చేశారు... రూ. 5 కోట్లు వచ్చాయి...
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:02 IST)
కెనడాకు చెందిన ఓ జంట ఈ ఏడాది వేలంటైన్స్ డే సందర్భంగా ఓ లాటరీ టికెట్ కొన్నారు. ఆ తరువాత దాన్ని ఇంట్లో ఎక్కడో పెట్టేసి, దాని సంగతే మర్చిపోయారు. సరిగ్గా రెండు రోజుల క్రితం తమ మనవడు స్కూల్ ప్రాజెక్ట్‌లో సహాయం చేయమని అడుగగా అందుకోసం ఇంట్లో ఉన్న కొన్ని పుస్తకాలను తీయవలసి వచ్చింది. అందులో ఒక పుస్తకం నుంచి ఓ కాగితం కింద పడింది. తీరా చూస్తే అది లాటరీ టికెట్.
 
దాన్ని గమనించిన ఆ జంట దాని గడువు ఉందో లేదో చూద్దాం అంటూ సంబంధిత లాటరీ వెబ్‌సైట్‌లో చెక్ చేశారు. సరిగ్గా మరో రెండు రోజులు అనగా ఏప్రిల్ 5 వరకు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఒకవేళ ఆ టిక్కెట్‌కు లాటరీ ఏమైనా వచ్చిందేమో చూడమని భార్య అడగగా భర్త ఆ లాటరీ వెబ్‌సైట్‌లోనే చెక్ చేసాడు. లాటరీ నంబర్‌ను సరిచూసుకున్న భర్తకు కాసేపు వరకు నోటమాట రాలేదు. 
 
10 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 14 లక్షలు) లాటరీ గెలుచుకున్నట్లు తెలుసుకున్నారు. కనీసం పట్టించుకోకుండా పక్కన పడేసిన లాటరీ, తమ మనవడి వల్ల దొరకిందని, రూ.5 కోట్లు వచ్చాయని కుటుంబసభ్యులు ఆనందపడిపోతున్నారు. అదృష్టం అంటే ఇదేగా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనాల మీదకు డబ్బులు విసిరేసిన వైకాపా నేత...