Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అమ్ముడుపోని ఆటగాళ్లెవరో తెలుసా?

Advertiesment
2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అమ్ముడుపోని ఆటగాళ్లెవరో తెలుసా?
, బుధవారం, 19 డిశెంబరు 2018 (14:20 IST)
2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాట మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో వరుణ్ చక్రవర్తి, జయదేవ్‌లే ఐపీఎల్ వేలం పాట జాబితాలో అత్యధికంగా కొనుగోలైన దేశీయ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే విదేశీ ఆటగాళల్లో ఇంగ్లీష్ ఆటగాడు శామ్ కుర్రన్ అత్యధిక ధర (రూ.7.2కోట్లు) పలికిన ఆటగాడిగా నిలిచాడు. 
 
ఇక వరుణ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసుకుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ జయదేవ్ ఉనాద్కట్‌కు సొంతం చేసుకుంది. ఇక మిగిలిన భారత ఆటగాళ్లలో అక్సర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), మోహిత్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్), శివన్ దుబేయ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్లు కైవసం చేసుకున్నాయి. ఇదే విధంగా కుర్రన్‌తో పాటు దక్షిణాఫ్రికా కోలిన్ ఇన్‌గ్రామ్‌ను ఢిల్లీ కేపిటల్స్ రూ.6.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. అలాగే వెస్టిండీస్ పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను రూ.5 కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. 
 
ఇక దేశీ ఆటగాళ్లు ఎంతెంత పలికారంటే..?
భారత పేసర్ మొహ్మద్ షమీ రూ.4.8 కోట్లు పలికాడు 
17 ఏళ్ల ఓల్డ్ వికెట్ కీపర్ ప్రబ్‌సింహన్ సింగ్  రూ. 4.8 కోట్లు పలికాడు
వెస్టిండీస్ నికోలస్ పూరన్ రూ.1 కోటి పలికాడు 
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మొయిసిస్ కూడా కోటి ధర పలికాడు
 
ఆర్సీబీ ఆటగాళ్ల కొనుగోలుపై భారీ పెట్టుబడి పెట్టింది. శివమ్, షిమ్రోన్ హెట్మర్ (రూ.4.2 కోట్లు), అక్స్‌దీప్ నాథ్ (రూ.3.6 కోట్లు), ప్రయాస్ రాజ్ బర్మన్ (రూ.1.5 కోట్లు)లను ఆర్సీబీ కొనుగోలు చేసింది. అలాగే ఢిల్లీ కేపిటల్స్ హనుమ విహారిని రూథర్ ఫోర్డ్‌ను చెరో రెండేసి కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇషాంత్ శర్మను రూ.1.10 కోట్లు వెచ్చించి వేలం పాటలో కొనుగోలు చేసింది. 
 
ఇకపోతే.. ముంబై ఇండియన్స్ సంగతికి వస్తే.. మలింగా కోసం రూ.2 కోట్లు వెచ్చించింది. బారిందర్ స్రాన్‌ కోసం రూ.3-4 కోట్ల మేర ఖర్చు చేసింది. అలాగే టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.  
 
సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు.. జానీ బారిస్టో (రూ.2.2 కోట్లు), వృద్ధిమాన్ సాహా రూ.1.2 కోట్లతో, కివీస్ ఆటగాడు.. మార్టిన్ గుప్తిల్‌ను రూ.ఒక కోటితో తొలి రౌండ్లోనే సొంతం చేసుకుంది. ఇంకా కేకేఆర్ జట్టు బ్రాత్ వైట్ (5కోట్ల రూపాయలతో), లాకీఫెర్‌గూసన్ (1.6 కోట్లకు) కొనుగోలు చేసింది. ఇదేవిధంగా ఐపీఎల్ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ వరుణ్ అరోన్ (రూ.2.4 కోట్లు)ను, ఒషానే థామస్ (రూ.1.10 కోట్లకు)ను కొనుగోలు చేసింది. 
 
అమ్ముడుపోని క్రికెటర్లు.. భారత టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పూజారా, న్యూజిలాండ్ స్టార్ మెక్ కల్లమ్, జేమ్స్ నీమ్, ఆండర్సన్, క్రిస్ వోక్స్, అలెక్స్ హాలెస్, క్రిస్ జోర్దాన్, హషీమ్ ఆమ్లా, మోర్కల్, ఏంజెలో మాథ్యూస్, కుషల్ పెరెరాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుంటే.. కోహ్లీలా చొక్కా విప్పేసి పరుగులు పెడతా..?