Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-10-2019- బుధవారం మీ రాశి ఫలితాలు...

Advertiesment
09-10-2019- బుధవారం మీ రాశి ఫలితాలు...
, బుధవారం, 9 అక్టోబరు 2019 (10:09 IST)
మేషం: భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. మీదైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
వృషభం: కుటుంబీకులమధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే సూచలున్నాయి. రుణాలు తీరుస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడుతారు. 
 
మిధునం: బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. జాయింట్ వెంచర్లు, ఉమ్మడి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. ఊహించని ఖర్చులెదురవుతాయి. 
 
కర్కాటకం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దీక్షలు, దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణపనులు, మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. బంధువుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది.
 
సింహం: ఉపాధ్యాయులకు పనిభారం అధికం. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల తీరు నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ఉపకరిస్తుంది.
 
కన్య: చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంలో స్వల్ప చికాకులుంటాయి. రావలసిన ధనం అందకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల: మీ శ్రమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ఆలయాలను సందర్శిస్తారు. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. విందులు, వినోదాల్లో కొత్త పరిచయాలేర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
 
వృశ్చికం: వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. వీసా, పాస్‌‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
ధనస్సు: ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చెల్లింపులు వాయిదా వేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ పనియందు ధ్యాస ఉండదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలత.
 
మకరం: స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. వృత్తుల వారికి నిరుత్సాహం తప్పదు. ప్రకటనలు, ప్రచురణలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు.
 
కుంభం: విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నూతన పరిశ్రమలు, వ్యాపారా విస్తరణలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
మీనం: దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైసూర్ రాజా వారి జంబూ సవారీ...