Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

08-10-2019- మంగళవారం మీ రాశి ఫలితాలు..

webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (10:06 IST)
మేషం: సొంతంగా గాని, భాగస్వామ్యంగా గాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. ఆలయాలలో ఆకస్మిక ఆందోళన తప్పదు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ అవసరం. పెద్దలతో పట్టింపులు సంభవిస్తాయి. 
 
వృషభం: వృత్తులలో వారికి చికాకులు, డాక్టర్లకు లాభదాయకం. ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు పరియాలు, వ్యాపకాలు అధికం. బంధుమిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దలను ప్రముఖులను కలుసుకోగలుగుతారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
మిధునం: ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. విద్యార్థులకు చదవుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. కళలు, క్రీడలపట్ల ఆసక్తి పెంచుకుంటారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం: దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడును. పండ్లు, పూల, కూరగాయరంగాలలో వారికి అనుకూలం. స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం: ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థుర్లకు ఒత్తిడి ఆందోళనలు తప్పవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు. 
 
కన్య: భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికిమించిన ఖర్చుల వల్ల ఆటు, పోట్లు తప్పవు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల: చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. శుభకార్యాల్లో బంధు మిత్రులతో పట్టింపులెదుర్కోంటారు.
 
వృశ్చికం: మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
ధనస్సు: మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. కొత్త అంశాలకు స్వీకారం చుడతారు. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. మీ ఆలోచనలు. పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. 
 
మకరం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. రుణాలు, పెట్టుబడుల కోసం చేసే యత్నం వాయిదా పడుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. 
 
కుంభం: దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ మాటతీరు, పద్ధతులను మార్చకోవలసి ఉంటుంది. వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం: ఎంత కష్టమైన పనైన అవలీలగా పూర్తి చేస్తారు. గత విషయాలూ జ్ఞప్తికి రాగలవు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. భూములకు సంబంధించి తుది ఒప్పందాలు చేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

విజయ దశమి రోజున ఏ శుభకార్యాన్నైనా చేయొచ్చు.. శమీపూజ చేస్తే?