Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-10-2019- ఆదివారం దినఫలాలు - బకాయిల వసూలలో శ్రమాధిక్యత...

webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (10:11 IST)
మేషం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు అధికం. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ప్రయాణాలలో జయం చేకూరుతుంది. ఉపాధ్యాయుల విశ్రాంతి పొందుతారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
వృషభం: వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆడంబరాలు, వ్యసనాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. లౌక్యంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెలుసుబాటు ఉంటుంది. 
 
మిధునం: గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడతారు. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. దైవ కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు. 
 
కర్కాటకం: విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తిని కనపరుస్తారు. బకాయిల వసూలలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. మీ ప్రమేయం లేకుండానే కొన్నివిషయాల్లో మాటపడవలసి వస్తుంది. 
 
సింహం: రవాణా రంగంలో వారికి చికాకులు తప్పవు. తొందరపడి వాగ్దానాలు చేయుటవలన మాటపడక తప్పదు. పెద్దల ఆశీస్సుల, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యానాలు కలవరపరుస్తాయి. రావలసిన ధనం అందటంతో మీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది.
 
కన్య: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.
 
తుల: కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు మంచిదికాదు. ప్రముఖులను కలుసుకుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు, స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభివించండి. 
 
వృశ్చికం: వివాహ నిశ్చితార్థాలు, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రుణాలు తీరుస్తారు. మీ కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఏ పని సక్రమంగా సాగక విసుగు కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తే అవకాశం ఉంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయం.
 
ధనస్సు: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ధనం చేతికందుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో విలువైన వస్తువుల మరిచిపోయే ఆస్కారం ఉంది.
 
మకరం: స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ అధికమవుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరం. మీ కార్యక్రమాలు, పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై సెంటిమెంట్లు, బంధురీవుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి.
 
కుంభం: మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి.
 
మీనం: సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడ, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దల మాటను శిరసా వహిస్తారు. మీరంటే కిట్టని వారు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ధనార్జన, ఆస్తుల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

06-10-2019 నుంచి 12-10-2019 వరకు మీ రాశి ఫలితాలు..