Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడమ చేతికి రుద్రాక్ష ధరిస్తే ఫలితం ఏమిటి?

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (20:17 IST)
కోరుకున్న కోర్కెలు నెరవేరాలంటే రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివపురాణం చెపుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయి. అయితే అంతకంటే ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉండవచ్చు. రుద్రాక్ష ముఖాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. 
 
ఏకముఖి రుద్రాక్షను చూడటం వల్లే పాపాలు నశించి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరతాయి. త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించిన సర్వ కార్యాలు సిద్దిస్తాయి. చతుర్ముఖి రుద్రాక్షను తాకినా చూసినా సకల పాపాలు నశిస్తాయి. పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది. షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజాన ధరిస్తే సర్వ పాపాలు నశించి శుభం చేకూరుతుంది. సప్తముఖి ధరిస్తే దరిద్రం నశించి ధనవంతులవుతారు. 
 
అష్ట ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల దీర్ఘాయుష్కులవుతారు. నవముఖి రుద్రాక్ష నవ దుర్గ రూపి. ఎడమ చేతిన ధరిస్తే శివతుల్యత్వం వస్తుంది. దశముఖి రుద్రాక్షను ధరించినవారికి సకల కోరికలు నెరవేరతాయి. ఏకాదశముఖి రుద్రాక్ష వల్ల అనుకున్నవి అన్నీ నెరవేరతాయి. ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల తేజస్సు కలుగుతుంది. త్రయోదశముఖి, చతుర్థముఖి రుద్రాక్షల వల్ల సకల కోరికలు నెరవేరతాయి. ఇక రుద్రాక్షలున్న మాలతో జపం చేసే వారికి మాలలో రుద్రాక్ష సంఖ్యను బట్టి ఫలితాలు చేకూరతాయి. 
 
25 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేస్తే ముక్తి వస్తుంది. 27 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేసిన వారికి పుష్టి కలుగుతుంది. 54 రుద్రాక్షలున్న జపం చేస్తే హృదయానికి మంచిది. 108 రుద్రాక్షలు గల జపమాలతో జపం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి. రుద్రాక్షను మెడలోగానీ, చేతికి గానీ , నడుముకు గానీ కట్టుకోవాలి. పిల్లలకు ధరింప చేస్తే బాలారిష్ట దోషాలు పోవటమే కాక అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతులవుతారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments