ఏ వారం ఏ రంగు దుస్తులు ధరించాలి...?

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (21:15 IST)
ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు.
 
అంతేకాదు... రోజులననుసరించి రంగులను ఎంచుకోండి. ఫలితం కనపడుతుందంటున్నారు జ్యోతిష్కులు.....
 
సోమవారం : సోమవారం అంటే చంద్రునికి ప్రతీక. కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి. 
 
మంగళవారం : మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
 
బుధవారం : వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారంనాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి. 
 
గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అనికూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. 
 
శుక్రవారం : శుక్రవారం దేవీ (అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి. 
 
శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. 
 
ఆదివారం : ఆదివారంనాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. కొన్ని రంగులు మనకు నచ్చుతుంటాయి. అనాయాసంగా ఆయా రంగుల పట్ల ఆకర్షితులమౌతుంటాము. దీనినే " కలర్ సైన్స్ " అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణ హత్య.. కారణం ఎవరంటే?

జూన్ 12 నుంచి కాదు.. జూన్ 15 నుంచి స్కూల్స్ పునః ప్రారంభం

కోలివింగ్ ప్రియుడి వేధింపులు తాళలేక ఐదవ అంతస్థు నుంచి దూకేసింది..

Elon Musk: భారత సంతానోత్పత్తి రేటు పడిపోయింది.. స్పేస్ఎక్స్ సీఈఓ మస్క్

వాట్సాప్ నుంచి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన కువైట్ భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

శ్రీవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం

తర్వాతి కథనం
Show comments