వైకుంఠ ఏకాదశి నాడు పూజ ఎలా చేయాలి? తామరపువ్వులు, తులసీ దళాలు..?

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2015 (18:48 IST)
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. 
 
అందుచేత వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.
 
విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
 
ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు కానుంది, గ్రిడ్‌ను విస్తరించకపోతే సమస్యే...

TDP and Jana Sena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ-జనసేన?

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

ఏపీలో టీం 11 ఉంది.. అర్థమైందా రాజా? అదో ఏడుపుగొట్టు టీం : మంత్రి లోకేశ్

బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడుగా నితిన్ నబిన్ ఏకగ్రీవం.. 20న ప్రమాణం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?

Show comments