Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురికి భార్యలైనా ద్రౌపది పతివ్రతే... సందేహమా...? ఐతే చదవండి...

ఒక భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది. కానీ ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ.. ద్రౌపది ఎలా పతివ్రత అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు. అలాంటి సందేహం మీలోనూ ఉంటే ఈ కథనం చదవండి. వీడియో చూడండి. ఆడదంటే

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (17:08 IST)
ఒక భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది. కానీ ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ.. ద్రౌపది ఎలా పతివ్రత అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు. అలాంటి సందేహం మీలోనూ ఉంటే ఈ కథనం చదవండి. వీడియో చూడండి. ఆడదంటే ఆదిపరాశక్తి.. పెళ్ళికి తర్వాత భర్తనే దేవుడిగా భావిస్తుంది. పతినే పూజిస్తుంది. సంప్రదాయం ప్రకారం ఒకే భర్త గల స్త్రీని ''పతివ్రత" అంటారన్న విషయం తెలిసిందే.

అయితే ఐదుగురు భర్తలు కలిగిన ద్రౌపదిని కూడా పతివ్రతే అంటారన్న విషయం కూడా మహాభారతం గురించి తెలిసిన అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ, ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆ వాదన సరైంది కాదని, ఐదుగురు భర్తలున్నప్పటికీ ద్రౌపది పతివ్రతే అని చెప్పే ఓ వీడియో యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఏముందంటే.. 
 
ద్రౌపదీ దేవి కచ్చితంగా పతివ్రతే... పాండవులు ఇంద్రుని స్వరూపం. ఇంద్రుడే ఐదుగురుగా జన్మనెత్తాడు. అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది. పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాదు. పంచపాండవులు, ద్రౌపది నవమాసాలు మాతృ గర్భంలో ఉండి, యోనిజులుగా జన్మించినవారు కాదు. వీరందరూ అయోజినులు. అంటే మాతృ గర్భం నుంచి పుట్టిన వారు కాదు. ద్రౌపది యజ్ఞ గుండం నుంచి ఉద్భవించింది. కారణ జన్మురాలు. అంటే ఆ పుట్టుకలో కారణం అనేది ఉంది. ఇక పాండవులు కుంతీ, మాద్రిలకు ఎలా జన్మించారో తెలిసిందే. 
 
కానీ పాండవులు కుంతీ, మాద్రిలకు జన్మించాల్సిన అసలు కథ చాలామందికి తెలియదు. సత్స ప్రజాపతి కుమారుడైన త్రిసురుని ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాపం సంక్రమించింది. తద్వారా స్వర్గలోక ఆధిపత్యాన్ని కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవ గురువైన బృహస్పతిని కలిసి, బ్రహ్మహత్య దోషం పోయే మార్గం చెప్పమని ప్రాధేయపడతాడు. బృహస్పతి ఇంద్రునికి తపస్సు చేయమని సూచిస్తాడు.

బ్రహ్మహత్య దోషాలున్న నీకు దైవ శక్తులు తోడుగా ఉండవని చెప్తాడు. నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. కాబట్టి నీ పంచప్రాణ శక్తుల్లో నాలుగింటిని నీకు నమ్మకం గల వారివద్ద దాచి ఉంచమంటాడు. ఐదో ప్రాణ శక్తి నీ దగ్గరే వుంచుకోమంటాడు. ఆపై తపస్సు చేసి బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోమంటాడు. గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన నాలుగు శక్తులను యముడు, వాయుదేవుడు, అశ్వినీ దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభిస్తాడు. 
 
పాండురాజు భార్యలైన కుంతీమాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. అలా యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచ ప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి.. జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాదు. ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో ఆతని భార్య సచీదేవి రాక్షసుల బారినుండి తనకు రక్ష కావాలని అగ్నిదేవుడిని వేడుకుంటుంది. ఆయన నీడలో కాలం గడుపుతుంది. 
 
కానీ తన భర్త ఇంద్రుడు ఐదు రూపాల్లో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న సచీదేవి.. యజ్ఞ గుండం నుంచి ద్రౌపదిగా జన్మించి.. పంచపాండవులకు అర్థాంగిగా మారింది. భౌతికంగా పాండవులు ఐదుగురిగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధంగా సంసారం సాగించిన ద్రౌపది కచ్చితంగా పతివ్రతే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాలన్నీ మార్కండేయ పురాణంలో వున్నాయి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

తర్వాతి కథనం
Show comments