Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి చుట్టూ పురుషులు ప్రదక్షణ చేస్తే...? (video)

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (23:01 IST)
తులసి అనగానే చాలామంది కేవలం మహిళలు మాత్రమే పూజించాలి అనుకుంటారు. కానీ పురుషులు కూడా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానమాచరించి తులసికోట చుట్టు ప్రదక్షణ చేసినట్లయితే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పబడింది. మహిళలు శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటూ రోజూ తులసి మొక్కకు నీళ్ళుపోస్తారు సంధ్యాసమయంలో అక్కడ దీపం వెలిగించి కుంకుమ, పుష్పాలతో తులసిని అర్చిస్తారు. తులసిదళాలు, పుష్పాలు లేనిదే శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణ భగవానునికి అర్చన పరిసమాప్తి కాదని పురోహితులు అంటున్నారు. 
 
ఇతిహాసాల ప్రకారం తులసి కృష్ణుల వివాహం హిందూ సంప్రదాయంలో ప్రధానమైంది. తులసి వివాహ పర్వంగా దీనిని జరుపుతారు. ఆధునిక కాలంలో కూడా అన్ని ప్రాంతాలకు ఈ గాథ వర్తిస్తుంది. తులసి పత్రాలు ప్రతి పండుగనాడు, ప్రతి పవిత్ర సందర్భాలలోనూ వినియోగిస్తారు.
 
తులసిలో ఔషధ గుణాలు వున్నందున ఆ ఆకుల కషాయాన్ని జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బందులను తొలగించేందుకు వినియోగిస్తారు. పర్వదినాలలో దేవతలకు చేసే నివేదనలలోను, కొన్ని ప్రత్యేక విందులలోనూ అతిథులకు ఆహారపదార్థాలపై తులసి ఆకును వుంచి అందించడం సంప్రదాయం. 
 
పర్వదినాన చేసే భోజనంపైన, ప్రసాదంపైన తులసి పత్రం ఉంచడం ప్రేమకు, విధేయతకు చిహ్నం. ఆహారశుద్ధికి, విశ్వ చైతన్య శక్తికి ఆ పదార్థాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తున్నామనేందుకు చిహ్నం తులసిపత్రం. తీర్థంలో కూడ తులసిని విధిగా చేస్తారు. తులసి పత్రం త్యాగగుణానికి గుర్తు. పదార్థంపై తులసి ఆకు వుంచాక ఇచ్చేవానికి దానిపై ఎలాంటి హక్కు వుండదు. అందుకే వివాహ సమయాల్లో వధువు తల్లిదండ్రులు ఒక తులసి పత్రాన్ని లేదా బంగారంతో చేసిన తులసి పత్రాన్ని సమర్పిస్తుంటారు. 

 



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

తర్వాతి కథనం
Show comments