Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో రిటైర్డ్ కానున్న తితిదే ఉద్యోగులు.. భర్తీలపై నోరు మెదపని అధికారులు

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (13:17 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈనెలలో రికార్డు స్థాయిలో ఉద్యోగ విరమణలు జరుగనున్నాయి. జూన్‌ 30వ తేదీన 111 మంది అధికారులు, ఉద్యోగులు రిటైర్డ్ కాబోతున్నారు. ఇందులో హెల్త్ విభాగానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కీలక పోస్టుల్లో ఉన్న వారు ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు.
 
ఈ యేడాది జనవరి నుంచి డిసెంబర్‌ దాకా తితిదేలో 283 మంది అధికారులు, ఉద్యోగులు రిటైర్డ్ మెంట్‌ జాబితాలో ఉన్నారు. ఇందులో మే 31దాకా 40 మంది విశ్రాంత జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. జూన్‌ 30వ తేదీకి 111 మంది ఉద్యోగులు విరమణ చేయనుండగా అందులో హెల్త్ సెక్షన్‌లలోనే  41 మంది ఉన్నారు. 23 మంది మల్టీ పర్పస్‌ వర్కర్లు, 18 మంది స్వీపర్లు ఉన్నారు. కళ్యాణకట్టలో 11 మంది మేస్త్రీలు, ఒక క్షురకుడు ఉద్యోగ జీవితం నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 8 మంది, ప్రెస్‌లో ముగ్గురు, ట్రాన్స్ పోర్టులో ఇద్దరు ఉద్యోగులు విరమణ చేయనున్నారు. 
 
జులై నెలలో డిప్యూటీ ఈఓ బేబీ సరోజిని, ఎస్‌వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌ రాజయ్య సహా 25 మంది ఉద్యోగులు విరమణ చేయబోతున్నారు. ఆగస్టులో డిప్యూటీ ఈఈ సోమసుందరయ్య, తిరుపతి మ్యూజియం అసిస్టెంట్‌ క్యూరేటర్‌ పార్థసారథి రెడ్డితో పాటు 29 మంది విశ్రాంత జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబరులో 18 మంది, అక్టోబర్‌లో 19 మంది, నవంబర్‌లో 14 మంది, డిసెంబర్‌లో 25 మంది ఉద్యోగులు విరమణ చేయనున్నారు. 
 
సెప్టెంబర్‌లో డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, ఎఈఓ కేశవరాజులు, అక్టోబర్‌లో నరసింహాచార్యులు, నవంబర్‌లో ఏఈఓ శివారెడ్డి, డిసెంబర్‌లో డిప్యూటీ ఈఓ భూపతిరెడ్డి, మరో డిప్యూటీ ఈఓ చంద్రశేఖర్‌ పిళ్లైలు కూడా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఐదుగురు డిప్యూటీ ఈఓలు ఉద్యోగ విరమణ చేసినట్లు అవుతుంది. ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు పెంచకుంటే ఇందులో పలువురు దాదాపు రెండేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ చేసి ఉండాల్సి ఉండేది. అలాగే ఏ యేడాదిలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. రానున్న యేడాదిలో ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య భారీగానే ఉంటుంది. 
 
తితిదేలో రాను రాను రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. ఒకప్పుడు 15,000 మంది దాకా ఉంటే ఇప్పుడు 9,500 మందికి పడిపోయారు. ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన పోస్టులను తితిదే భర్తీ చేయడం లేదు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ కార్మికులతోనే నెట్టుకొస్తోంది. అందుకే వారి సంఖ్య రెగ్యులర్‌ ఉద్యోగుల కంటే పెరిగింది. ప్రస్తుతం తితిదేలో 13,000 మందికిపైగా అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులే ఉన్నారు. ఈ కార్మికులు కాకుండా 7,000 పోస్టులు భర్తీ చేయడానికి అవకాశముందని యువజన, నిరుద్యోగ సంఘాలు చెబుతున్నారు. వీటిని భర్తీ చేయమని చాలా కాలంగా వారు కోరుతున్నారు. 
 
రిటైర్డ్‌మెంట్‌‌తో ఖాళీ అవుతున్న పోస్టులైనా భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ అనుమతి రాలేదంటూ కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నా తితిదేలో ఉద్యోగాలు మాత్రం భర్తీ అవడం లేదు. మరోవైపు ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతోంది. కీలకమైన శాఖలు కూడా అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులతో నింపడం తితిదే శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదు. కొన్ని శాఖలైతే పూర్తిగా కాంట్రాక్టు కార్మికులతో నిండిపోయింది. ఇప్పటికైనా తితిదేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని తితిదే ఉద్యోగులు, నిరుద్యోగులు కోరుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

తర్వాతి కథనం
Show comments